కర్నాటకలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదని, హంగ్ ఏర్పడవచ్చని సర్వేలు చెప్తున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ కు పట్టం కడుతుంటే.. మరికొన్ని బీజేపీకి అధికారం ఖాయమంటున్నాయి. అయితే బీజేపీకి ఒక ఊహించని సమస్య వచ్చిపడింది.


కర్నాటకలో గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని నిన్నమొన్నటి వరకూ ఊహాగానాలు రావడంతో బీజేపీ అలెర్ట్ అయింది. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించింది. కొన్నేళ్లక్రితం బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించింది. వారికి ఆర్థికంగా ఎలాంటి ఢోకా లేకపోవడంతో వారిని బరిలోకి దింపితే కనీసం పాతిక స్థానాల్లో గెలుపును ప్రభావితం చేయవచ్చనేది బీజేపీ ఆలోచన.

Image result for sriramulu bjp

గాలి జనార్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్న శ్రీరాములుకు బదామి నుంచి బరిలోకి దింపింది. అంతేకాక.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపైనే ఏకంగా పోటీకి నిలబెట్టింది. ఇక్కడ శ్రీరాములు గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయం. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ – బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. సిద్ధూను ఎలాగైనా ఓడించాలని బీజేపీ అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Image result for sriramulu bjp

అయితే.. శ్రీరాములు రూపంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. గతంలో ఓబులాపురం మైనింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టడంతో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన్ను విడిపించుకునేందుకు అనుచరుడు శ్రీరాములు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఆ క్రమంలో 2010లో ఓ జడ్జి అల్లుడికి శ్రీరాములు రూ.160 కోట్లు లంచం ఇవ్వజూపారని చెప్తున్న ఓ సీక్రెట్ వీడియోను కర్నాటకలోని బీటీవీ బయటపెట్టింది. ఈ కేసులో జడ్జి తన పదవీకాలం చివరి రోజు వారికి అనుకూలంగా తీర్పు చెప్పారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడిది సంచలనం కలిగిస్తోంది.


ఈ వీడియో 8 ఏళ్ల క్రితం నాటిదే అయినా.. అది వాస్తవమా.. కాదా .. అనేదే ఇప్పుడు ప్రశ్న. ఈ కేసులో వారికి అనుకూలంగా తీర్పు రావడం, జడ్జి చివరి రోజు ఆ తీర్పు చెప్పడం.. లాంటి అనేక అంశాలు అప్పట్లోనే పలు అనుమానాలకు తావిచ్చాయి. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీకి ఈ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవేమోననే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: