కర్ణాటకలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా మరో మూడు రోజుల్లో మైకుల మోతకు నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగియనుండగా, ఆపై బయటి నుంచి వచ్చిన వారంతా వెళ్లిపోవాలని ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన వారు మాత్రమే ఉండాలని, ఇతర ప్రాంతాల వారుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీగా ప్రచారాలు చేశారు. 
Image result for కర్ణాటక ఎన్నికలు
చిన్నస్థాయి నాయకుల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షులు రాహూల్ గాంధీ వరకు తమ ఉపన్యాసాలతో ఊదరగొట్టారు. అయితే గెలుపు తమదే అంటే తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇరుపార్టీ నాయకులు. ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీ (ఎస్) నేతలంతా చివరిసారిగా ఓటర్లను అభ్యర్థించేందుకు పలు బహిరంగ సభలను ఏర్పాటు చేసుకున్నారు. హుబ్లీలో రాహుల్ నేడు ర్యాలీని నిర్వహించి, ఆపై మధ్యాహ్నం తరువాత జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
Image result for కర్ణాటక ఎన్నికలు
మరోవైపు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించామని ఈసీ వెల్లడించింది. 50 వేలకు పైగా ఈవీఎంలను సిద్ధం చేశామని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొంది. 
Image result for కర్ణాటక ఎన్నికలు
ఎన్నికల్లో ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా జరిగేలా అన్నీ సంసిద్దం చేశామని..సున్నిత ప్రాంతాలు, అతి సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, అదనపు బందోబస్తుతో గస్తీ నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: