ఏపీఎ స్ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య వివాదంలో చిక్కుకున్నారు. నిన్న ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే, ఓ బస్సులోని ఓ ప్రయాణికుడు ఇదేమీ పట్టించుకోకుండా తన మొబైల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇది గమనించిన వర్ల రామయ్య ఆ ప్రయాణికుడి కులం గురించి అడిగి తెలుసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘బస్సు ఎక్కాం..దిగాం..వాడు మాత్రం మనను వినడం లేదు. అది డేంజర్.. వాళ్ల నాన్నకు వీడేమీ ఉపయోగపడడు..’ అని రామయ్య వ్యాఖ్యానించారు.
Image result for varla ramaiah
సదరు ప్రయాణికుడిని ‘నువ్వు మాల, మాదిగ?’ అని ప్రశ్నించారు. ‘మీ అయ్య ఏం పనిచేస్తాడు? మీ అమ్మ? ఎన్ని ఎకరాల పొలం ఉంది. బ్యాంకులో ఎన్ని లక్షలు ఉన్నాయి. మరి ఎట్లా చదువుకుంటావు?’ అని మందలించారు. దీనికి సంబంధించిన   వీడియోలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన  చంద్రబాబు, వెంటనే వర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

దళిత నేత అయ్యుండి విద్యార్థిపై ఈ వ్యాఖ్యలేంటని మండిపడ్డ ఆయన, పార్టీ పరువును బజారులో పెట్టవద్దని హెచ్చరించినట్టు సమాచారం. వర్ల వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.  ఈ తరహా ఘటనలను తాను సహించబోనని హెచ్చరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వర్లపై విపక్ష నేతలతో పాటు దళిత సంఘాలు కూడా నిప్పులు చెరుగుతున్నాయి. జరిగిన ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: