దేశవ్యాప్తంగా బీజేపీ దండయాత్ర చేస్తుండగా ఒక్క తెలంగాణలో మాత్రం ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. అయినా అక్కడ బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కనిపించడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయని సమాచారం. ఇంతకూ తెలంగాణను బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదు..?

Image result for telangana bjp

          అలెగ్జాండర్ ప్రపంచంపై దండెత్తినట్టు దేశంపై బీజేపీ దండయాత్ర చేస్తోంది. ఇప్పటికే 21 రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. మరో రాష్ట్రాన్ని రేపోమాపో చేజిక్కించుకుంటామనే నమ్మకంతో సాగుతోంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలపై దృష్టిపెట్టి దేశం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనుకుంటోంది. ఇందుకోసం ఎంతోకాలంగా వ్యూహరచన చేస్తోంది. ఒక్కో రాష్ట్రాన్ని పక్కా ప్లాన్ తో తమ చేతుల్లోకి తెచ్చుకుంటోంది. కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అని ఇప్పటికే ప్రకటించింది. దక్షిణాదిలో కూడా ఉత్తరాది లాగా సత్తా చాటాలనుకుంటోంది కమలదళం. అయితే ఒక్క తెలంగాణ మాత్రం బీజేపీ లిస్టులో లేదు.

Image result for telangana bjp

          దేశమంతా తమకే కావాలనుకుంటున్న కాషాయదళం.. తెలంగాణను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదనేదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. వాస్తవానికి ప్రత్యేక తెలంగాణకు ఔట్ రైట్ గా సపోర్ట్ చేసింది బీజేపీ. నాడు రాజ్యసభలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. కాబట్టి తెలంగాణ సాధనలో బీజేపీ పాత్రను తోసిపుచ్చలేం. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధికారం చేపట్టడం, కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో బీజేపీ బలపడడానికి అవకాశాలేర్పడ్డాయి. కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉండడంతో స్వతహాగా ఆ పార్టీకి కాస్త ఎడ్జ్ కనిపించింది. అయితే తెలంగాణ ఏర్పడి నాలుగేళ్లయినా కూడా ఆ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా.. ఉన్న లీడర్లను కూడా కోల్పోవాల్సి వస్తోంది. ఎందుకిలా జరుగుతోంది.?

Image result for telangana bjp

          తెలంగాణలో బీజేపీ బలపడకపోవడానికి ఆ పార్టీ అధిష్టానం తీరే కారణమనే ఆరోపణలున్నాయి. తెలంగాణలో తాము ప్రత్యామ్నాయంగా ఎదగడానికి అవకాశాలున్నా.. అధిష్టానం సరిగా దృష్టి పెట్టకపోవడం వల్లే నష్టపోవాల్సి వస్తోందనేది టీబీజేపీ నేతలు చెప్తున్న మాట. బీజేపీతో కేసీఆర్ అంటకాగడం కూడా తాము ఎదగలేకపోవడానికి అడ్డంకిగా మారిందనే టాక్ కూడా ఉంది. నేతలు వెళ్లిపోతున్నా బీజేపీ అధిష్టానం చూసీచూడనట్లు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవసరమైనప్పుడు కేసీఆర్ తమకు అండగా నిలుస్తాడనే నమ్మకం ఉండడం, కాంగ్రెస్ ను ఎదగనీయకుండా కేసీఆర్ బీజేపీ హెల్ప్ కోరడం.. లాంటి అండర్ స్టాండింగ్స్ వల్లే ఈ పరిస్థితి ఉందనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: