ఆగష్టు 1 నాటికి పంచాయితీ ఎన్నికల కాలం ముగుస్తుంది. ఇప్పటికే ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయమని ఎన్నికల  కమిషన్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశాడు. అయితే ఇంత వరకు టీడీపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. ఈ  ఎన్నికలను నిర్వహించడానికి చంద్ర బాబు కు అంత ధైర్యం లేదని అందరి నుంచి వినిపిస్తున్న మాటలు. ఇప్పటికే బాబు ప్రభుత్వం మీద సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

Image result for chandra babu

ఒక పక్క కేసీఆర్ చాలా రోజుల కిందటే.. గడువులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని వెల్లడించేశారు. కానీ చంద్రబాబు ఇప్పటిదాకా ఆ ఊసెత్తడం లేదు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు గెలవాలని పడికట్టు పదాలు ఉపయోగించే ఆయన, పంచాయతీ ఎన్నికలకు పూనుకోవడం ద్వారా తన ధైర్యం నిరూపించుకునే ప్రయత్నం చేయడం లేదు. అసలు ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పంచాయతీ ఎన్నికలకు కేవలం పది లక్షల రూపాయలను మాత్రం కేటాయించినప్పుడే.. చంద్రబాబు సర్కార్ ఉద్దేశం ఏమిటో అందరికీ అర్థమైపోయింది. కొన్ని నగర కార్పొరేషన్ లకే ఎన్నికలు నిర్వహించకుండా చాలా కాలంగా జాగుచేస్తున్న బాబు సర్కార్.. పంచాయతీలకు పెడుతుందనుకోవడం భ్రమ.

Image result for chandra babu

అయితే సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వలన.. ప్రజా ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నేరుగా విడుదలయ్యే నిధులు చాలా వరకు ఉంటాయి. అయితే పాలకవర్గాలు లేకపోతే ఆ నిధులు రావు. అభివృద్ధి కుంటుపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: