తానే గొప్ప. తానే నిప్పు. తన అనుభవం తోనే దేశం సుభిక్షంగా వర్దిల్లుతుంది. తన పాలన తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం లోనే నంబర్-వన్ గా పురోగమిస్తుంది. ఇలా ఎన్నో గొప్పలు చెప్పుకుంటుంటారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మొత్తం ఏ మంచి జరిగినా క్రెడిట్ అంతా తన ఖాతాలో జమ కావాలి. ఏ చెడు జరిగినా కేంద్రం లేదా ప్రతిపక్షం ఖాతాలో జమ అవ్వారి. ఇదే ఆయన ప్రధాన రాజకీయ సిద్ధాంతమని రాష్ట్రంలో టిడిపి నాయకులతో సహా ఆరు కోట్ల ఆంద్రులు చెపుతారు. కాకపోతే టిడిపి వాళ్లు వ్యక్తిగత సమావేశాల్లో చెప్పుకుంటారు తప్ప బయటకు మాట్లాడరు కదా! 


కర్నాటక శాసన సభ ఎన్నికల రణరంగంలో తెలుగు వారి రాజకీయ హడావుడి కొత్త వివాదాలకు దారి తీస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్ గెలవాలన్న బలమైన కాంక్ష తో ఉన్న తెలుగు దేశం పార్టీ అందుకోసం చేయని ప్రయత్నం లేదు. గట్టిగానే టిడిపి పోరాటం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రత్యక్షంగా నేరుగా వెళ్లి ప్రచారం చేయడానికి టిడిపి అదినేత నారా చంద్రబాబు నాయుడు దైర్యం అయితే చేయలేదు కాని, బిజెపిని ఓడించాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారు. 
chalasani srinivas sivaji ashok babu కోసం చిత్ర ఫలితం
బిజెపితో టిడిపి సంబందాలు తెంచుకున్న తర్వాత ఆయన కర్నాటక ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారతాయనిచంద్రబాబు ముందుగానే అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ టిడిపి నేతల సమావేశంలో కూడా ప్రస్తావించారు. కర్నాటకలో "జెడిఎస్" కు ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నేరుగానే చెప్పి వచ్చారు. కావాలంటే ప్రచారానికి కూడా వెళతానని అన్నారు కాని ఆయన ఇంతవరకు వెళ్లలేదు. అదే సమయంలో తన పార్టీ వారిని కూడా అక్కడకు పంపినట్లు కనపడలేదు.కాని చంద్రబాబు మాత్రం తన సహజశైలిలో పరోక్ష వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు ఆయన డబ్బు కూడా పంపించారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.అదే సమయంలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఎపి ఎన్.జి.ఓ నేత అశోక్ బాబు రంగ ప్రవేశంతో టిడిపి రాజకీయం బహిర్గతమైంది. పైకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనుక బిజెపిని ఓడించండని టిడిపి నేతలు కాని, అశోక్ బాబు వంటి వారు కాని ప్రచారం చేస్తున్నారు. నిజానికి టిడిపికి ప్రత్యేక హోదా ప్రదాన సమస్యకాదు. 
chandra babu harming ap by promoting congress indirectly in karnataka కోసం చిత్ర ఫలితం
అనూహ్యంగా బిజెపితో తెగతెంపులు చేసుకున్న తర్వాత జరుగుతున్న, జరగబోయే పరిణామాలపై చంద్రబాబుకు ఏదో సమాచారం ఉన్నట్లుగా ఉంది. ఇప్పటికే ఆయన కర్నాటక ఎన్నికల తర్వాత తమపైకాని, తన ప్రబుత్వ అదికారులపై కాని వివిధ అక్రమాల కేసులు రావచ్చని భయపడుతున్నారు.అందుకనే ఆయన తన చుట్టూ ప్రజలు వలయంగా నిలబడి రక్షించాలని కూడా అభ్యర్దించారు. అవినీతి అధికారులపై గాని ప్రజాప్రతినిధులపై కాని కేంద్ర చర్య తీసుకుంటుంటే ప్రజలెందుకు వాళ్ళని వలయంలా చుట్టి ఎందుకు కాపాడతారు? ప్రజలు పిచ్చోళ్ళా? 


కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే, బిజపి దూకూడు తగ్గుతుందని ఆయన ఆశ. తాను ప్రదాని నరెంద్ర మోడీని రకరకాల రూపంలో అవమానించిన నేపద్యంలో ఆయన ఎక్కడ ప్రతీకార చర్యల కు దిగుతారోనన్న దిగులు భీతి భయం చంద్రబాబును వేటాడటానికి వెంటాడుతోంది. ఆయన ముఖంలో ఆ భయం ప్రేత కళ కనబడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  అయితే కర్నాటకలో గెలిచినా, ఓడినా చంద్రబాబుపై కేసుల వ్యవహారంపై చర్యలు జరపక తప్పదని కొందరు బిజెపి నేతలు చెబు తున్నారు.
chandra babu harming ap by promoting congress indirectly in karnataka కోసం చిత్ర ఫలితం
అయితే, కర్నాటకలో నలభై నుంచి అరవై సీట్లలో తెలుగువారు ప్రబావం చూపగలరని ఒక అంచనా. దానిని ఆసరా చేసుకుని టిడిపి నాయకత్వం విశ్వయత్నం చేస్తోంది. అయితే దీని ప్రబావం పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందా? లేక నెగిటివ్ అవుతుందా అన్నది చెప్పలేం. ఎందుకంటే ఎపి లో ఉన్నవిదంగానే అక్కడ కూడా సామాజికవర్గాలు, రాజకీయ పార్టీల వారిగా తెలుగువారు కూడా విడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 
chalasani srinivas sivaji ashok babu కోసం చిత్ర ఫలితం
ప్రత్యేక హోదా సెంటిమెంట్ కొద్దిగా పనిచేస్తే చేయవచ్చు. అయితే అది కాంగ్రెస్ కు తల నొప్పి తెచ్చి పెట్టవచ్చు. ఎందుకంటే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తే పొరుగు రాష్ట్రాలలోని పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉందని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అభ్యంతరం తెలిపాయి. అప్పట్లో జయలలిత అయితే ఏకంగా ప్రధానికి లేఖ రాశారు. అంతే కాదు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అంగీకరించలేదు. ఈ నేపధ్యంలో కర్నాటక స్థానికులు ఎవరైనా ఈ అంశంపై స్పందిస్తే కాంగ్రెస్ కు నష్టం చేసే అవకాశం ఉంటుంది. 
chandra babu harming ap by promoting congress indirectly in karnataka కోసం చిత్ర ఫలితం
అలా జరిగితే తెలుగు దేశం పార్టీ కాని, ఇతరత్రా తెలుగు నేతలు కాని కాంగ్రెస్ కు మేలు చేయబోయి నష్టం చేసినవారు అవుతారేమో కూడా ఆలోచించాలి. అక్కడ ఉన్న వారిని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వారికి ఇస్టం వచ్చినవారికి ఓటు వేసుకోనిస్తే మంచిది. లేకుంటే తెలుగుదేశం పార్టీ ధైర్యంగా కాంగ్రెస్ లేదా జెడిఎస్ కు మద్దతు ఇచ్చినా తప్పు కాదు.


అలాకాకుండా ఎప్పటి మాదిరి వెన్ను పోటు చాటు మాటు వాలి తరహా రాజకీయం చేయడం ద్వారా కర్నాటక లో నివసిస్తున్న తెలుగు వారి మద్య చిచ్చు పెట్టేలా ప్రయత్నాలు చేస్తే అది ప్రమాదకరం అవుతుంది. నిజమే ప్రత్యేక హోదా విషయంలో బిజెపి మోసం చేసింది. నరెంద్ర మోడీ మాట తప్పారు.అందులో సందేహం లేదు. అయితే ఆ పాపంలో తిలా పాపం తలా పిడికెడు అంటూ నరెంద్ర మోడీతో పాటు చంద్రబాబుకు అందులో సమాన వాటా ఉంది.
chandra babu harming ap by promoting congress indirectly in karnataka కోసం చిత్ర ఫలితం
దానిని కప్పిపుచ్చుకోవటానికే చంద్రబాబు తన చిలకపలుకులు ఏపి ఎన్.జి.ఓ.నేత అశోక్ బాబు నోట పలికిస్తున్నారు. అయితే అదే అశోక్ బాబు బెంగుళూరు వెళ్లి బిజెపి ని ఓడించాలని తెలుగు సంఘాలను రెచ్చగొట్టటంపై బిజిపి మండిపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండీ రాజకీయాల్లో ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తోంది. చలసాని శ్రీనివాస్, సొంటినేని శివాజి వంటి వ్యక్తులు ప్రచారం చేశారంటే అర్దం చేసుకోవచ్చు. కాని అశోక్ బాబు టిడిపి తరపున వెళ్లడం మాత్రం అభ్యంతరకరంగానే కనిపిస్తుంది.
chalasani srinivas sivaji ashok babu కోసం చిత్ర ఫలితం
అయితే కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే అది నరెంద్ర మోడీ ఓటమిగాను, తన గెలుపుగాను చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. కాంగ్రెస్ వారి కన్నా చంద్రబాబే ఎక్కువ సంతోష పడతా రని అన్నట్లున్నాయి పరిస్థితులు. అదే సమయంలో బిజెపి ఒకవేళ గెలిస్తే మాత్రం టిడిపి పెనం లోనుండి పొయ్యిలో పడ్డట్లే. ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో గుజరాత్ కాంగ్రెస్ కు టిడిపి నాయకత్వం డబ్బు పంపించిందన్నది బిజెపికి సంపూర్ణ సందేహం ఉంది. అయితే బిజెపిని  ఈ విషయంలో సంతృప్తి పరచటానికి ఒకరికి టిటిడి పదవి ఇచ్చి, ఒక దారి కనీసం తెరిపించుకున్నారని అంటున్నారు. అయితే  చంద్రబాబు నాయుడు కర్నాటక ఎన్నికల ఫలితాల గురించి దేశంలో అందరి కన్నా ఎక్కువ ఆందోళన తో ఉన్నారని మాత్రం చెప్పవచ్చు. చంద్రబాబు కేసుల సమస్యేమోకాని, కర్నాటకలోని తెలుగువారు మద్య ఇప్పుడు కొత్త కొత్త గొడవలు పెరిగేలా ఉన్నాయి. ఇది మాత్రం పద్దతిగా అనిపించదు.
chalasani srinivas sivaji ashok babu కోసం చిత్ర ఫలితం
ఇక పోతే మనం ఎంతో కొంత సాధించుకోవాల్సింది కేంద్రం నుండే. కాని అదే కెంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి వ్యతిరేఖ ప్రచారం చేస్తే వారికి మనపై సాఫ్ట్ కార్నర్ ఎలా ఉంటుంది. వారు మనకు ఇక సహాయం చేయటానికి మనస్కరిస్తారా? ఇప్పుడు అసోక్ బాబు, చలసాని శ్రీనివాస్, సొంటినేని శివాగి ని ప్రజలు వేరుగా చూడట్లేదు వారు చంద్రబాబుకు అతి సన్నిహితులు. అదే కులానికి చెందిన ఆ ప్రాంత వాసులు. వాళ్ళేమన్నా బిజెపికి వ్యతిరెఖ ప్రచారం చేసినా అది నిర్ద్వందంగా చంద్రబాబు మెడకే చుట్టుకుంటుంది. వీరి తీవ్ర స్వభావం రాష్ట్రానికి కీడుతప్ప మేలు చేయదని జనం ప్రఘాఢ విశ్వాసం. అయిన కర్ణాటక ఎన్నికల కంప మనకు తగిలించుకోవట మెందుకు? ఇదీ ప్రధాన ప్రశ్న. 

chalasani srinivas sivaji ashok babu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: