ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు పథకం వేసి గతేడాది గుజరాత్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ కి పట్టుబడ్డ ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా) నిందితులు అహ్మద్‌ మీర్జా, మహ్మద్‌ ఖాసీం స్టింబెర్‌వాలా.. విచారణలో సంచలన విషయాలు బయటపెట్టారు. తమకు పట్టుబడిన ఇద్దరు అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను విచారించిన గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయాలని వారు కుట్ర పన్నినట్టు తన చార్జ్ షీట్ లో పేర్కొంది. మోదీని ఓ స్నిప్పర్ రైఫిల్ తో కాల్చేయాలని ఉబెద్ అహ్మద్ మీర్జా, తన అనుచరుడికి ఫోన్లో సూచించాడని ఏటీఎస్ పేర్కొంది. 

ఏటీఎస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది గుర్తు తెలియని ఉగ్రవాది ఒకరు అరెస్టయిన ఇద్దరు ఐఎస్‌ ఉగ్రవాదులతో మోదీని హత్య చేయడం గురించి మాట్లాడాడు. ‘‘అవును, ఒక స్నైపర్‌ రైఫిల్‌తో మోదీని లేపేద్దాం’’ అని గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇద్దరు ఐఎస్‌ ఉగ్రవాదులకు చెప్పాడని ఏటీఎస్‌ తన చార్జిషీటులో పేర్కొంది. ఉబెద్‌ అహ్మద్‌ మీర్జా, మహ్మద్‌ ఖాసీం స్టింబెర్‌వాలా అనే ఇద్దరు ఉగ్రవాదుల్ని గత ఏడాది అక్టోబరులో అరెస్టు చేశారు.  "అవును... మోదీని స్నిప్పర్ రైఫిల్ తో చంపేద్దాం... ఇన్షా అల్లా" అని వీరు మాట్లాడుతున్నారని తెలిపింది.

ఇందుకోసం రష్యాలో తయారైన గన్ కావాలని మీర్జా కోరాడని వెల్లడించింది.  మరో వాట్స్ యాప్ చాట్ లో భారతీయులపై విచక్షణా రహితంగా దాడులు చేయాలని అందుకు కత్తులు వాడాలని ఉన్నట్టు విచారణ అధికారులు వెల్లడించారు. బాంబులు, పేలుడు పదార్థాలు వాడకుండా, ఇండియాలోని విదేశీయులను టార్గెట్ చేసుకోవాలని వారికి పైనుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిపారు.  2016 జూలై 26న మరోచాట్‌లో వేటకత్తులు, వంటింటి కత్తులతో దాడులకు దిగాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయని ఫెరారీ... మీర్జాకు చెప్పాడు.

ఫెరారీ సహా మీర్జాతో వాట్సాప్‌ చాట్‌ చేసిన వ్యక్తుల గురించి ఏటీఎస్‌ దర్యాప్తు చేస్తోంది. స్టింబర్‌వాలా అంకలేశ్వర్‌లోని ఒక ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేసేవాడు. మీర్జా సూరత్‌ కోర్టులో న్యాయవాది.నిందితులు మీర్జా, స్టింబర్ వాలా జీహాదీ భావజాలం పట్ల బాగా ఆకర్షితులయ్యారని పేర్కొంది. ఇక ఈ కేసుకు సంబంధించి జమైకాకు చెందిన అబ్దుల్లా ఫైజల్ అనే రాడికల్ బోధకుడు పరారీలో ఉన్నట్టు చార్జిషీటులో ఏటీఎస్ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: