ఎన్నికలు వచ్చాయంటే..ఓటర్లకు పండుగ వాతావరణమే అని చెప్పొచ్చు..ప్రతి నాయకుడు ఇంటి తలుపు తట్టి ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు..ఈ సారి గెలిపిస్తే..మీకు అవి చేస్తాం..ఇవి చేస్తాం అని వాగ్ధానాలు మాత్రమే కాదు ఓటు వేసినందుకు ప్రతిఫలం కూడా ఇస్తామని ప్రలోభాలు పెడుతుంటారు.  అయితే కొంత మంది వాటిని వ్యతిరేకించినా..కొంత మంది మాత్రం ప్రలోభాలకు లోనవుతుంటారు.  ఇది ఎప్పటి నుంచో వస్తున్న తంతే..అయితే  ఎన్నికల సంఘం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంది..ఇలా ప్రలోభాలకు లోనైతే..తర్వాత ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చిరిస్తూనే ఉంది..కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి.

తాజాగా కర్ణాటక లో ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం నుంచి ప్రారంభం అయ్యింది.. ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున క్యూ కట్టారు. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Restaurant lures first time voters with Masala Dosa & Coffee for voting
ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది.  ఇదిలా ఉంటే తాజాగా బెంగుళూరులోని నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణ రాజ్ బెంగుళూరులో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న ప్రయోగం చేశారు. ఈ ఎన్నికల్లోనే తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకొంటున్న వారికి ఉచితంగా దోశ, ఫిల్టర్ కాఫీ  ఇవ్వనున్నట్టు ప్రకటించారు.   
Image result for karnataka elections polling
ఈ ఉచిత దోసె, కాఫీని పొందాలంటే ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును హోటల్‌లో చూపించాల్సి ఉంటుంది. ఎవరికైనా ఓటేయండి.. కానీ ఓటు హక్కును వినియోగించుకోండని హోటల్ యజమాని కొత్త ప్రచారాన్ని చేపట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: