ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, మనకు నచ్చని పని బలవంతంగా చేయాల్సి వచ్చినప్పుడు నిరసన తెలపడం చాలా కామన్. అయితే ఈ నిరసన పలు రకాలు. ఒకరు తిండిమానేసి నిరసన తెలిపితే.. మరికొందరు రోడ్డుపై బైఠాయిస్తుంటారు. ఇంకొందరు ఫ్లవర్స్ ఇచ్చి శాంతియుతంగా ప్రొటెస్ట్ తెలియజేస్తారు. అయితే ఓ అమ్మాయి మాత్రం వెరైటీగా బట్టలిప్పి నిరసన తెలిపింది.


ఓ అమ్మాయి అందరి ముందూ బట్టలిప్పి నిరసన తెలపడం అంటే దాని వెనుక ఏదో పెద్ద కథే ఉండాలి. అవును.. అమెరికాలో లెటీథియా చాయ్ అనే అమ్మాయి బట్టలిప్పి నిరసన తెలియజేయడం వెనుక పెద్ద కథే ఉంది. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిధిలోని ఐవీ లీగ్ స్కూల్ లో లెటీథియా చాయ్ అనే ఆసియా సంతతికి చెందిన మహిళ చదువుకుంటోంది. ప్రాజెక్టులో భాగంగా ఆమె థీసిస్ సమర్పిస్తున్న సమయంలో లెటీథియా ఒక్కసారిగా బట్టలిప్పేసింది. అప్పటివరకూ థీసిస్ ను వింటున్న వాళ్లంతా లెటీథియా చేస్తున్న పని చూసి షాక్ కు గురయ్యారు. అయితే అలా బట్టలిప్పడం వెనకున్న స్టోరీని లెటీథియా చెప్పిన తర్వాత అక్కడున్నవాళ్లంతా సంఘీభావం తెలపడం విశేషం.


లెటీథియా చాయ్ గతంలో థీసిస్ సమర్పించే సమయంలో రెబెకా మ్యాగోర్ అనే ప్రొఫెసర్ కొన్ని అభ్యంతరకరమైన కామెంట్లు చేశారట. “ఆ పొట్టి డ్రస్సులేంటి.. హెయిర్ సరిదిద్దుకో.. ఇలాంటి వేషాలేసుకుని ఎలా వస్తారు..” లాంటి అనేక మాటలు మాట్లాడారట. అప్పుడు ఆ మాటలకు నొచ్చుకున్న లేటీథియా.. ఇప్పుడు థీసిస్ సమర్పిస్తున్న సమయంలోనే నిరసన తెలపాలనుకుని బట్టలిప్పేసింది. అందరూ చూస్తుండగానే లోయర్, టాప్ తీసేసి నిలబడింది. బట్టలిప్పేసిన తర్వాత తాను ఎందుకలా చేయాల్సి వచ్చిందో వివరించింది. స్త్రీపురుషుల మధ్య అంతరాలు తొలగించాల్సిందిపోయి అమ్మాయికి కాబట్టి ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని చెప్పడం లెటీథియాకు కోపం తెప్పించింది. అందుకే అలా చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: