కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకొని తిరిగి వెనక్కి వెళ్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు టీడీపీ నేతలు రాళ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. ఇంక ఈ ఘటనతో సీరియస్ అయిన ఏపీ సీఎం చంద్రబాబు నిందితులపై చర్యలు తీసుకుంటామని, పార్టీనుండి సస్పెన్స్ చేస్తామని కూడా తెలిపారు. 


ఈ క్రమంలోనే అమిత్ షా వాహనంపై దాడి  చేశారనే ఆరోపణలతో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వారి అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు అలిపిరి పోలీస్‌స్టేషన్ వరకు తన నేతలతో ధర్నాకు దిగారు. వారిని విడిపించాలని బీజేపీపై వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడే  భైఠాయించారు.


శనివారం ఉదయం ఎక్కువసంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అప్పుడే ధర్నాకు దిగినవారికి తోడవడంతో అలిపిరి పోలీసుస్టేషన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ జరిగింది. దీంతో పరిస్థితి చేజారుతుందని భావించిన పోలీసులు ఎటూ తేలని స్థితిలో ఆ నిందితులను విడిచిపెట్టి అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే టీడీపీ వారు దాడి చేశారని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటే ఇప్పుడు వారిని విడిచిపెట్టడం బాబుకు మళ్ళీ తలనొప్పులు తీసుకొస్తాయేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: