కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ముగిసిపోయింది...ఈ సందర్భంగా కన్నడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోడానికి ఎంతగానో ఆసక్తి చూపించారు. సాయంత్రం నాలుగున్నర నుండి ఐదు గంటల వరకు దాదాపు 65 శాతం ఓటింగ్ నమోదైంది...యువత ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రస్తుత ఎలక్షన్ లో.

Image result for bjp congress

గత సార్వత్రిక ఎన్నికలలో 2013లో 70.23శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కర్ణాటక ఎన్నికలపై పంచ్ వేశారు. ఇంగ్లీష్ ఛానల్స్ లో కర్ణాటక ఎన్నికల గురించి చూస్తుంటే గందరగోళంగా ఉందని పేర్కొన్నారు.

Image result for karnataka assembly elections 2018 voting images

రెండు ఇంగ్లీష్ చానల్స్ వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలుస్తుంది అని చెప్పగా...మరో రెండు ఇంగ్లీష్ చానల్స్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని చెబుతోంది...మొత్తంమీద ఈ ఛానల్స్ ఆధారంగా చూస్తే కర్ణాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడేటట్లు ఉంది అని సెటైరికల్ గా పంచ్ వేశారు.

Image result for lagadapati rajagopal

అలాగే కర్ణాటక ఎన్నికలు అయ్యీ అవ్వగానే తెలుగు రాష్ట్రాలలో ఆక్టోపస్ గా పేరుతెచ్చుకొన్న లగడపాటి రాజగోపాల్ ఒక సర్వే బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికలలో నమోదైన ఓటింగ్ శాతం బట్టి రెండు జాతీయ పార్టీలు అయినా బిజెపి-కాంగ్రెస్ మధ్య పోటా పోటీ జరిగిందని పేర్కొన్నారు...అయితే పరిస్థితి బట్టి చూస్తే కర్ణాటక ఎన్నికలలో జేడీఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని తాజా సర్వే బట్టి కర్ణాటక అధికారపీఠం జోస్యం చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: