ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాకాని వెంకటరత్నం విగ్రహం తొలగింపు విజయవాడలో ఉద్రిక్తతకు దారి తీసింది. గత అర్థరాత్రి బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడానికి అధికారులు ప్రయత్నించగా వైసీపీ నేత యలమంచిలి రవి అడ్డుకున్నారు. విగ్రహ కమిటీకి చెప్పకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ పనుల కోసమే విగ్రహాన్ని తొలగిస్తున్నామని అధికారులు వివరించారు. బెంజి సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ పనులకు అడ్డంకిగా ఉండటంతోనే విగ్రహం తొలగించాల్సి వచ్చిందని, పనులు పూర్తయ్యాక తిరిగి యథాతథంగా ప్రతిష్ఠిస్తామని అధికార పార్టీ నేతలు స్పష్టం చేశారు.

కృష్ణావాసులకు సుపరిచితమైన కాకాని వెంకటరత్నం గురించి తెలియని వారు ఉండరు. జై ఆంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన పోరాటం చేస్తూనే కన్నుమూశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నాటి ప్రభుత్వం బెజవాడలోని అత్యంత కీలకమైన బెంజి సర్కిల్‌లో కాకాని విగ్రహాన్ని ప్రతిష్ఠిచింది. బెంజి సర్కిల్‌లో పై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం, పనులు సైతం ప్రారంభించింది.  కాగా,  ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత య‌ల‌మంచిలి ర‌వి విగ్రహాన్ని తొల‌గించ‌వ‌ద్దు అంటూ అడ్డుకున్నారు.

క‌నీస స‌మాచారం ఇవ్వ‌కుండా అర్ధ‌రాత్రి ఎలా తొల‌గిస్తారంటూ.....ఫైఓవ‌ర్ అధికారుల‌పై ర‌వి మండిప‌డ్డారు. ఈనేపథ్యంలో పోలీసుల‌కు, య‌ల‌మంచిలి రవి మ‌ధ్య తోపులాట జ‌రిగింది. అనంత‌రం య‌ల‌మంచిలి ర‌విని పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు త‌ర‌లించారు. ఈ ఉద్రిక్త‌త‌ల నుడుమ జై ఆంధ్ర ఉద్య‌మ నేత కాకాని వెంక‌ట‌రత్నం విగ్రహాన్ని ఫైఓవ‌ర్ అధికారులు తొలగించారు.అనంతరం వారిని గన్నవరం తరలించి అక్కడ నుంచి ఉంగుటూరు స్టేషన్‌కి తరలించారు


మరింత సమాచారం తెలుసుకోండి: