గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతుంది.  ఇక వైసీపీ నుంచి టీడీపీ..టీడీపీ నుంచి వైసీపీకి వలసలు అవుతున్నారు.  ఇక బీజేపీ నుంచి టీడీపీ, వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న వారూ ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా కాపుల తరుపు నుంచి పోరాడుతున్న ముద్రగడ పధ్మనాభం తాజాగా కన్నా లక్ష్మీనారాయణను కలవడం సెన్సేషన్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులైన సంగతి తెలిసిందే.
Image result for mudragada padmanabham
ఎప్పట్నుంచో సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయి ఊహించని వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. కాగా,  కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. అనంతరం సుమారు అరగంటపాటు పలువిషయాలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో కన్నా ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. 
Image result for kanna laxminarayana
ఈ  సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ..బీజేపీ అధ్యక్షునిగా నియమించినందుకు సంతోషపడ్డాను. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు చెప్పాను. 6 నెలల్లో రిజర్వేషన్లు ఇస్తానని సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. కాపుల పట్ల చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు. కేంద్రాన్ని కూడా కాపు రిజర్వేషన్లకు సహకరించాలని కోరాం. చంద్రబాబును అడిగిన విధంగానే రాష్ట్రంలోని బీజేపీ నేతలను కూడా అడిగాము" అని ఆయన మీడియాకు వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: