చంద్రబాబు ఆలోచనాపరుడు, వివేచనాపరుడు, సమైఖ్యఆంధ్రప్రదేశ్ ను విజయవంతంగా నడిపించాడనే ఆలోచనలతోనే ఆంధ్రప్రజలు అనుభవశాలి అయిన చంద్రబాబుకు గతఎన్నికలలో పట్టం కట్టారు. ఈ ఎన్నికలలో కూడా చంద్రబాబు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నా పార్టీలోని కేడర్ మూలాన ఆయన కాస్త జంకుతున్న పరిస్థితి కనపడుతోంది.


ఈ విషయమయే చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఒక రహస్య సర్వే నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయా నియోజక వర్గంలో తమ ప్రజా ప్రజాప్రతినిధుల గురించి ప్రజలు  ఏమనుకుంటున్నారు, వారి పాలన ఎలా సాగుతుంది అన్న విషయంపై రహస్యంగా సర్వే చేయించి ఆయా ప్రాంత నాయకుల పనితీరును బట్టి కూడా ప్రత్యేకమైన ర్యాంకులను ఇచ్చినట్లు ఈ మేరకు విషయం బయటకి పొక్కింది.


ఇక ఈ సర్వేలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ 79.66 శాతం తో మొదటి స్థానంలో ఉండగా, బోడ్ ప్రసాద్, గద్దె రామ్మోహనరావు, శ్రీరాం తాతయ్య , రాధాకృష్ణ, రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ , తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు , చింతకాయల అయ్యన్నపాత్రుడు లు తదితరస్థానాల్లో నిలిచారు. అయితే ఈ సర్వేలు ఎన్నికల ముందు వరకూ జరుగుతూనే ఉంటాయని, సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగానే టిక్కెట్టు ఖరారవుతుందని ఈ మేరకు సీఎం చంద్రబాబు తమ పార్టీ నేతలను హెచ్చరించినట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: