కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుత పరిస్థితుల బట్టి ఎగ్జిట్ పోల్స్ బట్టి కర్ణాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశాలు మెండుగా కనబడుతున్నయి. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు గా భావిస్తున్నారు చాలామంది. మే 15వ తారీఖున ఉదయం 10 గంటలకల్లా కర్ణాటక రాష్ట్రంలో ఎవరు అధికారం చేపడతారో క్లారిటీ వచ్చేస్తుందని చాలామంది అంటున్నారు.
Related image
ఈ క్రమంలో జాతీయ పార్టీ నాయకులు కాంగ్రెస్ బిజెపి నాయకులు తాము అధికారంలోకి వస్తానంటే తాము అధికారంలోకి వస్తామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడినా కాని తాము ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు కన్నడ రాష్ట్ర బిజెపి నాయకులు...ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయినా జేడీఎస్ తో మంతనాలు జరిపినట్లు వెల్లడి చేస్తున్నారు కొంతమంది.
Image result for bjp karnataka
ఈ క్రమంలో ఆ పార్టీ అధినాయకుడు దేవెగౌడ తో బిజెపి నాయకులు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే డేట్ కూడా చెప్పేస్తున్నారు.
Image result for bjp karnataka
మొత్తంమీద బిజెపి కర్ణాటక రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ వస్తే ఫర్లేదు కానీ.. ఏ మాత్రం తేడా వచ్చినా.. బీజేపీదే అధికారమని చెప్పక తప్పదు. మరోపక్క జేడీఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని విభేదిస్తుంది. మరి కర్ణాటక ప్రజలు ఎటువంటి తీర్పునిచ్చారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: