కన్నడ ఎన్నికలు దేశం మొత్తం ఎంతో ఉత్కంఠ ను రేపుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వే లో ఏ పార్టీ కి కూడా సంపూర్ణ మద్దతు రాదని సర్వేలు తేల్చడం తో కాంగ్రెస్ కు దెబ్బ పడనున్నదని తెలుస్తుంది. బీజేపీ తన కుటిల రాజకీయాలు అమలు చేయబోతోందని తెలుస్తుంది. అవసరమైతే జేడీస్ పార్టీ కి అధికారం ఇస్తుంది కానీ కాంగ్రెస్ ను గెలవనివ్వదు అని స్పష్ఠంగా అర్ధం అవుతుంది. ఏ పార్టీ అయినా అధికారం లో ఉంటె బీజేపీ కి ఒకే కానీ కాంగ్రెస్ ఉంటె బీజేపీ కి నచ్చదు.

Image result for karnataka elections

కానీ పైకి మాత్రం.. దేవెగౌడ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము భాజపాతో పొత్తుపెట్టుకోబోయేది లేదని చెబుతూ వస్తోంది. 2008లో అనుభవం తమకు చాలునని.. తిరిగి వారితో కలిసేది లేదని.. దేవెగౌడ అంటున్నారు. కానీ.. కన్నడ ఎన్నికల సంగ్రామం ప్రారంభం అయిన నాటినుంచి.. భాజపా వ్యవహరిస్తున్న తీరును బట్టి.. జేడీఎస్ ను తెరవెనుక దువ్వుతున్న తీరును బట్టి... ఆ పార్టీల పొత్తులు కుదురుతాయనే అంతా అనుకుంటున్నారు.

Image result for karnataka elections

కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వస్తే తప్ప.. వారు అధికారంలోకి రావడం కష్టం. పైగా మరో అవకాశం కూడా కనిపిస్తోంది. భాజపాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవకాశం దక్కి.. అధికారానికి కొన్ని సీట్ల దూరంలో మాత్రమే ఉండేట్లయితే.. వారు బేరసారాలకు పాల్పడి అయినా సరే.. కొందరు ఎమ్మెల్యేలను చేజిక్కించుకుని అధికారంలోకి రాగలరు. అలాగే.. ఇండిపెండెంట్లు ఎందరు కర్నాటకలో గెలుస్తారనే దానిపై కూడా ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: