కర్ణాటక ఎన్నిక ఫలితం పై దేశమంతటా ఉత్కంట నెలకొంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కర్ణాటక ఎన్నికలు గురించే చర్చించుకుంటున్నారు...మరొకవైపు ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఓటర్లు రాజకీయ నాయకులను కంగారు పడుతూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో ఓటింగ్ శాతం తగ్గిందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కర్నాటక ముఖ్యమంత్రి పదవిని దళితుడికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు.
Image result for sidhi ramaiaha cm karnataka
ఇక్కడ ఇంకొక ట్విస్టు పెట్టారు..పార్టీ గెలిస్తే.. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకునేది అధిష్టానమేనంటూ ట్విస్టు ఇచ్చారు. ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతున్నడంటే  తన సీఎం పీఠాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడబోనని సిద్దూ స్పష్టం చేశారు. దీంతో కర్ణాటకలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Image result for sidhi ramaiaha cm karnataka
అయితే ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు దళిత నాయకులు ఉన్నారు వారు ఎవరంటే మల్లికార్జున ఖర్గే జీ పరమేశ్వర్ ఇద్దరికీ మంచి ప్రాధాన్యత ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే కర్ణాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో..కర్ణాటకలో జేడీఎస్ పార్టీ ఏ పార్టీ అధికార పీఠం లో కూర్చోబెట్టాలో డిసైడ్ చేసే విధంగా ఉంది.
Image result for sidhi ramaiaha cm karnataka
ఈ క్రమంలో ఎన్నికల ముందు జేడీఎస్ బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో జిడిఎస్ కాంగ్రెస్తో కలిసి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని... ఇందుమూలంగా వ్యూహాత్మకంగా ముందుగానే సిద్దిరామయ్య ఇటువంటి కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే మరోపక్క జేడీఎస్ డిసైడ్ చేసే పాత్రలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కుమారస్వామి సింగపూర్ వెళ్లడం రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశం అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: