తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడానికి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అధిష్టానం అనేక వ్యూహాలు పన్నుతోంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే అంతర్గత కుమ్ములాటలతో గ్రూపు రాజకీయాలతో తమ పరువును బజారుకీడుస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రేవంత్ రెడ్డి విషయం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
Image result for rahul gandhi revanth reddy

మరియు అదే విధంగా తనను గుర్తించడం లేదంటూ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కొంత అసహనం గా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడటంతో తన ముఖ్య ప్రత్యర్థి అయిన కేసిఆర్ నిది కొనాలంటే కాంగ్రెస్ సరైన వేదిక అని భావించి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Image result for rahul gandhi
ఈ క్రమంలో కాంగ్రెస్ లోకి వచ్చిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం టీపీసీసీ కార్యనిర్వాహ అధ్యక్ష పదవిలేక ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ పదవుల్లో ఏదో ఒకటి ఇస్తామని అధిష్టానం అప్పట్లో హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలోకి వచ్చి చాలా నెలలు గడిచినా ఇప్పటివరకు తనకు ఇచ్చిన హామీ గురించి అధిష్టానం ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు.
Related image
అయితే మరోపక్క అధిష్టానం నుండి రేవంత్ రెడ్డికి రావలసిన పదవులను అడ్డుకుంటున్నది టీ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు అని రేవంత్ రెడ్డి సన్నిహితుల వర్గాల వాదన. దీంతో రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి పయనమై తనకు ఇచ్చిన హామీల గురించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అడగనున్నట్లు సమాచారం...ఈ క్రమంలో మొన్న జరిగిన మీడియా సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నేతల పై కొంత విరుచుకుపడటం జరిగింది. మొత్తంమీద రేవంత్ వ్యవహారం చూస్తుంటే కాంగ్రెస్ తో తాడోపేడో తేల్చుకునే విధంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: