రాజ‌కీయాల్లో నిజ‌మైన రాజ‌కీయాలు ఏనాడో పోయాయి. అవ‌స‌రం,  అధికారం  ప్ర‌ధాన మార్గాలుగా నేడు రాజ‌కీయాలు న‌డు స్తున్నాయి. ఈ విష‌యంలో ద‌క్షిణాది కంటే ఉత్త‌రాది నాయ‌కుల‌కు అనుభ‌వం ఎక్కువ‌. ఇత‌రును ఎలా వాడుకోవా లి. త‌మ అవ‌స‌రం తీరాక ఎలా వ‌దిలించుకోవాలి. అనే విష‌యాలు వీరికి రాజ‌కీయాల‌తో పెట్టిన విద్య‌. అందుకే ఉత్త‌రాది రాజ‌కీయ నాయ‌కుల నోటికి నరం ఉండ‌ద‌ని అంటారు. విష‌యంలోకి వెళ్తే.. ఇప్పుడు ఏపీలో బీజేపీ రాజ‌కీయాలు కూడా అవ‌స‌రార్ధం మారుతున్న రాజ‌కీయాల‌నే త‌ల‌పిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

Image result for andhrapradesh

ఒక సామాజిక వర్గం ఓట్ల కోసం సిద్దాంతాలను పక్కన పెట్టి కన్నాకి పదవి ఇచ్చార‌ని బీజేపీ అధిష్టానంపై ఇప్ప‌టికే ఓ వ‌ర్గం మీడియా విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు… ఏపీలో టీడీపీని ఇబ్బంది పెట్టాలనే ప్ర‌ధాన‌ లక్ష్యంతో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ – బీజేపీ జాతీయ సార‌థి.. అమిత్‌ షా ద్వయం పార్టీలో సీనియర్లను పక్కన పెట్టి, అతిపెద్ద జాతీయ పార్టీలో అందునా సంఘ్ ప‌రివార్ నేప‌థ్యం కూడా లేకుంటానే పార్టీలో చేరి ప‌ట్టుమ‌ని రెండేళ్లు కూడా నిండ‌ని గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం వెనుక త‌మ స్వార్థం త‌ప్ప మ‌రేమీ ఉండ‌ద‌ని అంటున్నారు. 

Image result for bjp

కన్నాకు పదవి ఇవ్వ‌డం వెనుక మోడీ – షా ద్వయం ఆలోచన వేరేలా ఉందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న‌ మాట. నిజానికి కన్నాను పదవి ఇచ్చింది రాష్ట్రంలో ఒక వర్గాన్ని సంతృప్తి పరచి వారిని తమ వైపు తిప్పుకొనేందుకే. అదేస‌మ‌యంలో మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో కీల‌కంగా మారే రాజ‌కీయ పార్టీతో సంబంధ బాంధ‌వ్యాలు పెంచుకునేందుకు కూడా క‌న్నాను వాడుకోవాల‌ని మోడీ, షాలు వ్యూహం సిద్ధం చేసుకున్నార‌ని అంటు న్నారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో మోడీకి  పూర్తిస్థాయిలో మెజారిటీ వ‌చ్చే అవ‌కాశాలు దాదాపు స‌న్న‌గిల్లాయి. 

Image result for somu virraju

ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ప్రాంతీయ పార్టీతో మ‌చ్చిక చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. లేదా.. ఇత‌ర పార్టీల నుంచి గెలిచిన వారికి త‌మ పార్టీ తీర్థ‌మైనా ఇవ్వాలి. ఈ రెండూ చేయాలంటే.. అత్యంత స‌హ‌న‌శీలుడు, ముందుచూపు, నేత‌ల‌ను క‌లుపుకొని పోయే త‌త్వం ఉన్న‌నేత కావాలి. ఈ నేప‌థ్యంలోనే మోడీ, షాలు ఏరికోరి క‌న్నాను ఎంచుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ వ్యూహం వారిద్ద‌రికి వ‌ర్క‌వుట్ అయినా.. క‌న్నాకు మాత్రం ఎలాంటి ప్ర‌తిఫ‌లం లేకుండా చేస్తుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: