Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Aug 15, 2018 | Last Updated 7:23 am IST

Menu &Sections

Search

క‌న్నా నియామ‌కంపై బిజెపిలో అసంతృప్తి : అలిగిన వీర్రాజు

క‌న్నా నియామ‌కంపై బిజెపిలో అసంతృప్తి : అలిగిన వీర్రాజు
క‌న్నా నియామ‌కంపై బిజెపిలో అసంతృప్తి : అలిగిన వీర్రాజు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నూత‌న‌ అధ్య‌క్షునిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నియామ‌కంపై అసంతృప్తి బ‌య‌ట‌ప‌డుతోంది. క‌న్నా నియామ‌కాన్ని వ్య‌తిరేకిస్తూ  ప‌లువురు నేత‌లు రాజీనామాలు చేస్తున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు, రాజ‌మండ్రి న‌గ‌ర అధ్య‌క్షుడు త‌మ ప‌ద‌వుల‌కు ఇప్ప‌టికే రాజీనామాలు చేశారు.వీరి బాట‌లోనే మరింత‌మంది రాజీనామాలు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. పార్టీ ఎంఎల్సీ, సీనియ‌ర్ నేత అయిన సోము వీర్రాజు కూడా క‌న్నా నియామ‌కంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.
andhrapradesh-bjp-somu-virraju-kala-laxminaryana-t
క‌న్నాను కొత్త ప్రెసిడెంట్ గా నియ‌మిస్తూ జాతీయ నాయ‌క‌త్వం నిర్ణ‌యించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఆ మేర‌కు శ‌నివారం రాత్రి క‌న్నాకు ఉత్త‌ర్వులు కూడా అందాయి. అప్ప‌టి నుండి బిజెపి నేత‌ల్లో మిశ్ర‌మ స్పంద‌న క‌నిపిస్తోంది.  ఇపుడు రాజీనామాలు చేసిన ఇద్ద‌రు నేత‌లు కూడా వీర్రాజు మ‌ద్ద‌తుదారులే. సోమ‌వారం ఉద‌యం క‌న్నా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాను క‌లిసేందుకు ఢిల్లీ బ‌య‌లుదేరారు. అయితే, క‌న్నాతో పాటు ఢిల్లీకి వెళ్ళాల్సిన వీర్రాజు మాత్రం ఆగిపోయార‌ట‌. 

andhrapradesh-bjp-somu-virraju-kala-laxminaryana-t

ఎందుకీ అసంతృప్తి ?
క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను అధ్య‌క్షునిగా నియ‌మించ‌టంపై పార్టీలోని సీనియ‌ర్ల‌లో తీవ్ర అసంతృప్తి ఉన్న విష‌యం మాత్రం వాస్త‌వం. పార్టీలో ద‌శాబ్దాల‌పాటు ప‌నిచేస్తున్న నేత‌ల‌ను కాద‌ని కేవ‌లం ఐదేళ్ళ క్రిత‌మే పార్టీలోకి వ‌చ్చిన క‌న్నాకు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించ‌టాన్ని సీనియ‌ర్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అందులోనూ అధ్య‌క్ష ప‌ద‌వి రాద‌న్న కార‌ణంతో ఏకంగా పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న వ్య‌క్తికి అధ్య‌క్ష ప‌ద‌వి కట్ట‌బెట్ట‌టం ఎంత‌మాత్రం అంగీకారం కాద‌న్న‌ది కొంద‌రు సీనియ‌ర్ల వాద‌న‌.  కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల మాట‌ల‌ను బ‌ట్టి జాతీయ నాయ‌క‌త్వం ఒత్తిడికి లొంగిపోయింద‌న్న భావ‌న క‌న‌బ‌డుతోంది. 

andhrapradesh-bjp-somu-virraju-kala-laxminaryana-t

సీనియ‌ర్లు ఏం చేస్తారు ?
రాష్ట్ర అధ్య‌క్షునిగా క‌న్నా నియామ‌కం పై అసంతృప్తి ఉన్నా ఎవ‌రు ఏమీ చేయ‌గ‌లిగేది లేదు. ఎందుకంటే. ప్ర‌స్తుతం అమిత్ షా నిర్ణ‌యించారంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్రమోడి ఆమోదం లేకుండా జ‌రిగే ప‌నికాద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. పార్టీకి సంబంధించిన ఏ విష‌య‌మైనా ఇద్ద‌రు క‌లిసే నిర్ణ‌యిస్తున్నారు. అందుకే అమిత్ షా పేరుతో ఉత్త‌ర్వ‌లు వ‌చ్చినా, ఆదేశాలు అందినా అది మోడి నిర్ణ‌య‌మే అన్న విష‌యం పార్టీలోని నేత‌ల‌కు బాగా తెలుసు. అందుకే మోడి మాట‌కు ఎదురు చెప్పే ప‌రిస్ధితి ప్ర‌స్తుతం పార్టీలో లేదు. అందునా ఏపి లాంటి రాష్ట్రంలో అస్స‌లుండ‌దు. పార్టీ బ‌లంగా ఉన్న ఉత్త‌రాధి రాష్ట్రాల్లో మోడి, అమిత్ ధ్వయానికి ఎదురులేద‌ని అనుకుంటున్న‌పుడు ఇక ఏపి సంగ‌తి చెప్ప‌నే అక్క‌ర్లేదు.


క‌న్నా వ‌ల్ల ఎంత లాభం ?
బ‌ల‌మైన కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ‌ల్ల రాబోయే ఎన్నిక‌ల్లో కోస్తా జిల్లాల‌తో పాటు రాయ‌ల‌సీమ‌లో కొంతమేర పార్టీకి లాభం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని జాతీయ నాయ‌క‌త్వం అంచ‌నా వేస్తోంది. అందుకే పార్టీలో సీనియ‌రే కాకుండా కాపు సామాజివ‌క వ‌ర్గానికే చెందిన నేత అయిన‌ప్ప‌టికీ వీర్రాజు క‌న్నా క‌న్నా వైపే జాతీయ నాయ‌క‌త్వం మొగ్గు చూపింది. సామాజిక‌వ‌ర్గంలో కానీ లేదా రాజ‌కీయంగా కానీ వీర్రాజుతో పోల్చుకుంటే క‌న్నా గ‌ట్టి నేతే అన‌టంలో ఎవ‌రికీ సందేహాలు లేవు. రేప‌టి ఎన్నిక‌ల్లో కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను క‌న్నా ఆక‌ర్షించ‌గ‌ల‌ర‌న్న ఉద్దేశ్యంతోనే అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మ‌రి, ఏ మేరకు స‌క్సెస్ అవుతారో చూడాలి.andhrapradesh-bjp-somu-virraju-kala-laxminaryana-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియ‌ల్ : రాహూల్ తో నారా బ్రాహ్మ‌ణి భేటీ..ప్ర‌త్యేక‌హోదాకు హామీ
చంద్ర‌బాబు పై గ‌వ‌ర్న‌ర్ కు జివిఎల్ ఫిర్యాదు
వెన్నుపోటు ద్వారా లోకేష్ సిఎం అవ్వాల‌నుకుంటున్నారా ?
లోకేష్ కు ప‌వ‌న్ స‌ల‌హా ! పాటిస్తే ఏమ‌వుతుంది ?
చంద్ర‌బాబు పై చార్జిషీటా ?
ఎడిటోరియ‌ల్ : టిడిపి..వైఎస్ భార‌తి పేరును ఎందుకు ర‌చ్చ‌కీడుస్తోంది ?
గ‌బ్బ‌ర్ సింగ్ ట్యాక్స్ ఉండ‌దు..రాహూల్
చంద్ర‌బాబు ప‌నిని జెసి బ్ర‌ద‌ర్సే చేసేస్తున్నారు
ఆరోప‌ణ‌ల‌పై య‌ర‌ప‌తి ఎదురుదాడి
ఎడిటోరియ‌ల్ : కాపుల ఓట్ల‌లో చీలిక త‌ప్ప‌దా ? పిఆర్పీ అనుభ‌వ‌మే కార‌ణ‌మా ?
న‌ర‌స‌రావుపేట‌లో ఉద్రిక్త‌త..వైసిపి నేత‌ల అరెస్టులు
ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ శాంపుల్ మ్యానిఫెస్టో చూశారా ? ఆచ‌ర‌ణ సాధ్య‌మేనా ?
అశోక్ బాబుకు చుక్క‌లు చూపించిన ఉద్యోగులు
న‌రేంద్ర‌మోడి, చంద్ర‌బాబు మ‌ళ్ళీ క‌ల‌సిపోతారా ?
ప‌వ‌న్ కు కుమార‌స్వామే ఆద‌ర్శ‌మా ?
ఎడిటోరియ‌ల్ : ముస్లింల ఓట్ల కోసం చంద్ర‌బాబు ఎత్తులు
ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్ ను ఎదుర్కోలేక చంద్ర‌బాబు చేతులెత్తేశారా ?
ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ప‌వన్, టిడిపి స‌మావేశం ? ఇద్ద‌రూ ట‌చ్ లో ఉన్నారా ?
ఎడిటోరియ‌ల్ : న‌ంద్యాల‌కు ఎందుకంత ప్రాధాన్య‌త ? చ‌ంద్ర‌బాబు పోటీ చేస్తారా ?
జెసి బిగ్ జోక్... ఎంపి సీట్లన్నీ టిడిపికేన‌ట‌
చార్జిషీట్ ప్ర‌చారంపై జ‌గ‌న్ కు షాక్
రిజ‌ర్వేష‌న్ల పేరుతో మోసం చేశారు...చంద్ర‌బాబుపై పవ‌న్ ఫైర్
వైఎస్ భార‌తిపై చార్జిషీటు...వైసిపిలో సంచ‌ల‌నం
ఎడిటోరియ‌ల్ : మోడి, చంద్ర‌బాబు..ఇద్ద‌రిలో ఎవ‌రు చాణుక్యుడు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.