దేశవ్యాప్తంగా అందరి చూపు కర్ణాటక ఎన్నికల పైనే ఉంది. మే 12న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని నిలుపుకుంటుందా?.. లేక కాషాయ పార్టీ ఖాతాలో మరో రాష్ట్రం చేరుతుందా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నెల 12వతేదీన జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలచిన 2,655 మంది అభ్యర్థులు తమ భవిష్యత్ ను పరీక్షించుకోనున్నారు.  కర్ణాటక రాష్ట్రంతోపాటు పలు ప్రాంతాల వారు ఎన్నికల ఫలితాలపై  వేల కోట్లరూపాయలకు పైగా పందాలు కాశారని వెల్లడైంది. 


టీవీ ఛానళ్లలో వచ్చే సర్వే ఫలితాలు, పత్రికల్లో వచ్చే కథనాలతో కర్ణాటకలో హంగ్ వస్తుందని ప్రచారం సాగుతుండటంతో కొందరు బెట్టింగ్ రాయుళ్లు ఫలితాల గురించి ఆరా తీసేందుకు జ్యోతిషులను సంప్రదిస్తున్నారు.  కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లది నిర్ణయాత్మక పాత్ర. సుమారు కోటిమంది తెలుగువారు కర్నాటక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తారన్నది ఒక అంచనా. ఈ లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పందెం రాయుళ్ళ సందడిలోనూ తెలుగువారే దూసుకుపోతున్నారని విశ్లేషకుల అంచనా. 

Image result for కర్నాటక ఎన్నికలు బెట్టింగ్

కర్ణాటకలో ముఖ్యంగా బెంగుళూరు కేంద్రంగా నడిచే పేకాట క్లబ్ లు పబ్ లు నిర్వహించేవారిలో అత్యధికశాతం తెలుగు బడా బాబులే. జూద క్రీడను బాగా ఆస్వాదించే దక్షిణాది క్యాష్ పార్టీలన్నీ బెంగుళూరు చుట్టూ తిరుగుతూ వుంటారు. ఇప్పుడు వీరందరూ ఎన్నికల్లో గెలుపెవరిది అనే అంశంలో వివిధ రకాల పందాలు ఆడుతున్నారు.  రాష్ట్ర మంత్రి రామనాథ్ రాయ్ విజయంపై అధికంగా డబ్బు పందెం కాస్తున్నారు.  లక్షల్లో పందేలు కాస్తుండటంతో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతున్నట్టు సమాచారం. 


నియోజకవర్గం, అభ్యర్థిని బట్టి రూ.20 లక్షలతో మొదలుకుని రూ.50 లక్షల వరకు పందెం కాస్తున్నారట. ఇందులోనూ ఎక్కువమంది బీజేపీ ఓడిపోతుందనే బెట్టింగ్ కడుతున్నారట. మరికొందరు పార్టీలు చేసే తాజా సర్వేలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ పందాలు మారుస్తున్నారు. ఇలా కన్నడ రాజకీయాలు ఏ సంబంధం లేని వారికి కాసుల పంట పండిస్తోంది. సీఎం అభ్యర్థి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీరాములు పైనా జోరుగా బెట్టింగ్స్ పెడుతున్నారట. బళ్లారి నియోజకవర్గం పైనే ఎక్కువమంది బెట్టింగ్ కాసినట్టు కూడా చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: