చంద్ర బాబు నాయడు కు చుక్కలు చూపించేందుకు రంగం సిద్ధం అయ్యిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అవినీతి ని బయటికి తీస్తామని ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిసి పోయినాయి కనుక ఇక ఆంధ్ర ప్రదేశ్  మీద దృష్టి ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. ముఖంగా పోలవరం లో జరిగిన అవినీతి ని బయటికి తీసి బాబును జైలు పాలు చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుందని, బీజేపీ నుంచి మనకు వినిపిస్తున్న మాటలు. 

Image result for chandrababu naidu

రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పదవి చేపట్టిన తరువాత తన బాధ్యతల్లో భాగంగా మొదటిసారి చంద్రబాబుపై విమర్శలు సంధించారు. కేంద్రం ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా బాబు దాన్ని సాధించుకోలేకపోయారన్నారు. బాబు అవినీతికి పాల్పడకపోతే కేసులు పెడతారేమోనని ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇక వైకాపా, జనసేనతో బీజేపీ జత కడుతుందనే ఆరోపణల్లో వాస్తవం లేదని, దుష్ప్రచారమని చెప్పారు. బాబుకు చుక్కలు చూపించడంలో కన్నా హోంవర్క్‌ చేయాల్సివుంటుంది. ఆయన ప్రభుత్వ అవినీతిపై  పక్కా సమాచారం సేకరించి కేంద్రానికి ఇవ్వాలి కదా.

Image result for chandrababu naidu

బీజేపీ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై దృష్టి పెట్టింది. అది జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్రం నిధులిస్తోంది. నిధుల్లో చాలావరకు దుర్వినియోగమైనట్లు, వివిధ మార్గాల ద్వారా దారి మళ్లినట్లు ఆరోపణలున్నాయి. దీనిమీద కేంద్రం సిబీఐ విచారణ చేయిస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాని దీన్ని టీడీపీ నేతలు కొట్టిపడేస్తూ, నేరుగా సీబీఐ విచారణకు ఆదేశించే అధికారం కేంద్రానికి లేదని, కోర్టు ఆదేశిస్తే తప్ప విచారణ సాధ్యం కాదంటున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నిధులిస్తున్నందున నేరుగా విచారణకు ఆదేశించవచ్చని బీజేపీవారంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: