దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది.  ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని సర్వేలు చెప్పాయి. ఇది రెండు పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులైన సిద్ధరామయ్య, యడ్యూరప్పలకు శరాఘాతంగా మారింది. హంగ్ వస్తే పరిస్థితి ఏంటన్న దానిపై కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Image result for కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
రాజరాజేశ్వరినగర్‌లో నకిలీ ఓటర్ కార్డులు భారీగా బయటపడటంతో పోలింగ్ మే 28కి వాయిదా పడింది. 4.96 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,600 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 15న కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీని తెలిపేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

badami constituency election result 2018

బాదామి నియోజకవర్గం.. ఇక్కడ నుంచి సీఎం సిద్ధరామయ్య పోటీ చేశారు. ఇక్కడ సిద్ధరామయ్య పోటీ చేయడం ఒక విధంగా ఇంట్రస్టింగ్ అయితే, ఆయనతో బీజేపీ నేత ఢీ అంటుండటం మరో ఆసక్తిదాయకమైన అంశం. బాదామిలో సిద్ధూను ఓడిస్తానని శ్రీరాములు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. వీరి మధ్యన పోరాటంగా మారిన ఇక్కడ ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. మొళకాల్మూరు.. ఇక్కడ నుంచి కూడా శ్రీరాములు పోటీ చేశారు.
voters-arrive-to-cast-their-vote-at-booth
బీజేపీ తరఫున డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందిన శ్రీరాములుకు ఇక్కడ కొంత టఫ్ ఫైటే ఉంది. దాదాపు హంగ్ పరిస్థితులు తప్పవనే అంచనాల మధ్యన మొదలైన కౌంటింగ్‌లో అనూహ్యమైన ఫలితాలు వస్తాయా? లేక అనుకున్న ఫలితాలు వస్తాయా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. ఫలితాలు ఎలా వచ్చినా అది రసవత్తర రాజకీయమే అవుతుంది. మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2640 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: