• - సభలో బలనిరూపణ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని గవర్నర్ ని కోరిన యడ్యూరప్ప

  • - ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కావాలని కోరిన కుమార స్వామి

  • - కర్ణాటక ఎలక్షన్‌ ఫైనల్‌ రిజల్ట్‌: కాంగ్రెస్‌-78, భాజపా-104, జేడీఎస్‌-38, ఇతరులు-2 స్థానాల్లో విజయం

  • - ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గవర్నర్‌ కలిశారు

  • - కాంగ్రెస్‌ మద్దతు స్వీకరిస్తున్నాం. ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం- కుమారస్వామి

  • - ప్రజల ఆశీర్వాదంలో భాజాపా అతి పెద్ద పార్టీగా అవతరించింది : యడ్యూరప్ప

    - కర్ణాటక ప్రజలు మార్పు కోరుతు..తీర్పు ఇచ్చారు : యడ్యూరప్ప. 

    - బెంగుళూరు : దేవేగౌడ నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత సీకే జాఫర్ షరీఫ్

    -  బెంగుళూరు :  పద్మనాభనగర్ లోని దేవేగౌడ నివాసానికి చేరుకున్న కుమార్ స్వామి. దేవేగౌడ నివాసానికి భారీగా చేరుకుంటున్న జేడీఎస్ కార్యకర్తలు 

    - సాయంత్రం గవర్నర్ ను కలవనున్న జేడీఎస్, కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్న జేడీఎస్, కాంగ్రెస్.

    - జేడీఎస్ కి మద్దతు ఇవ్వడంతో కర్ణాటక రాజకీయంలో కొత్త మార్పు. 

    - అతిపెద్ద పార్టీ గా అవతరించినా..సాధారణ మెజార్టీ అందుకోలేక పోయిన బీజేపీ

    -  సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం- యడ్యూరప్ప

    - ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరనున్న జేడీఎస్‌, కాంగ్రెస్‌!

    - జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది: సిద్దరామయ్య
     
    - దిల్లీ రావాల్సిందిగా యడ్యూరప్పకు భాజపా అధిష్ఠానం ఆదేశం

    - ఈ రోజు సాయంత్రం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం

    - దేవెగౌడ, కుమారస్వామితో గులాం నబీ ఆజాద్, అశోక్‌ గెహ్లాట్‌ మంతనాలు
     
    - కర్ణాటకలో రసవత్తరంగా మారిన రాజకీయం, భాజాపాకు అధికారం దక్కకుండా కాంగ్రెస్ ఎత్తులు వేస్తుంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్దమైనట్లు సమాచారం. 

    - బెంగళూరులో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతల సమావేశం..!


  • - బెంగళూరు గాంధీనగర్‌లో దినేష్‌ గుండూరావు(కాంగ్రెస్‌) విజయం


  • - తమకూరు జిల్లా కొరటగెరెలో కేవీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర విజయం


  • - కాంగ్రెస్‌ 75, బీజేపీ 105, జేడీఎస్‌ 40, ఇతరులు 2 సీట్లలో ఆధిక్యం

  • - క్షణక్షణానికి మారుతున్న ఆధిక్యాలు.. మెజారిటీ ఫిగర్‌కు ఇంకా దూరంగానే బీజేపీ

  • - సాధారణ మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్‌ మద్దతు తీసుకోకతప్పని పరిస్థితి..

  • - బీజేపీ జేడీఎస్‌ మద్దతు తీసుకుంటుందా? లేక పార్టీలను చీల్చుతుందా?


  • -చాముండేశ్వరిలో సిద్ధరామయ్య ఓటమి. సిద్ధరామయ్యపై జేడీఎస్‌ అభ్యర్థి జి.టి.దేవెగౌడ విజయం


  • -బెంగళూరు బీటీఎం లేఅవుట్‌లో రామలింగారెడ్డి(కాంగ్రెస్‌)విజయం


  • -కర్ణాటక: సొరబలో కుమార్‌ బంగారప్ప(భాజపా)విజయం. సోదరుడు మధు బంగారప్ప(కాంగ్రెస్‌)పై కుమార బంగారప్ప జయకేతనం


  • -రామనగర నియోజకవర్గంలో కుమారస్వామి(జేడీఎస్‌) విజయం


  • -హుబ్లీ-ధార్వాడ్‌ సెంట్రల్‌లో జగదీశ్‌ శెట్టర్‌(భాజపా)విజయం


  • - కర్ణాటక: సిరుగుప్పలో భాజపా అభ్యర్థి సోమలింగప్ప విజయం


  • - కర్ణాటక: కంప్లిలో సురేశ్‌బాబు(భాజపా)విజయం
  •   

  • -కర్ణాటక: బెంగళూరు శివాజీ నగర్‌లో రోషన్‌ బేగ్‌(కాంగ్రెస్‌) గెలుపు


  • - కర్ణాటక: శివమొగ్గలో ఈశ్వరప్ప(భాజపా)విజయం



  • - షికారిపురలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప విజయం


  • -  మైసూరు మినహా మిగతా ప్రాంతాల్లో బీజేపీ హవా


  • - సాధారణ మెజార్టీ దిశగా బీజేపీ పరుగులు


  • - తీర్థహళ్లిలో అరగ జ్ఞానేంద్ర (బీజేపీ) గెలుపు


  • - మడబిద్రిలో ఉమనాథ విజయం


  • - రామనగరలో 7వేల ఓట్లతో కుమారస్వామి ఆధిక్యం


  • - చెన్నపట్నలోనూ ముందంజ


  • - హైదరాబాద్‌ కర్ణాటక, ముంబై కర్ణాటకలో బీజేపీ ముందంజ


  • - ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి దూసుకెళుతున్న జేడీఎస్‌


  • - దక్షిణ కర్ణాటకలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన జేడీఎస్‌


  • - కర్ణాటక: బెంగళూరు శివాజీ నగర్‌లో రోషన్‌ బేగ్‌(కాంగ్రెస్‌) గెలుపు


  • -కర్ణాటక: శివమొగ్గలో ఈశ్వరప్ప(భాజపా)విజయం


  • -దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 6గంటలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించనున్నారు


  • -ఇవాళ చరిత్రాత్మకమైన రోజు. ప్రధాని మోదీపై నమ్మకంతోనే కర్ణాటక ప్రజలు భాజపాను గెలిపించారు- రవిశంకర్‌ ప్రసాద్‌


  • -మొళకాల్మూర్‌లో శ్రీరాములు(భాజపా)విజయం


  • - బాగేపల్లిలో సినీ నటుడు సాయికుమార్‌(భాజపా)పరాజయం


  • - కర్ణాటక రిజల్ట్‌@12.00: కాంగ్రెస్‌-66, భాజపా-96, జేడీఎస్‌-36, ఇతరులు-2 ఆధిక్యం(భాజపా 14, కాంగ్రెస్‌ 6, జేడీఎస్‌ 2 స్థానాల్లో విజయం)

    - కర్ణాటకలో భాజపాకు ఇది అతిపెద్ద విజయం. కన్నడ ప్రజలు సుపరిపాలన కోరుకున్నారు - ప్రకాశ్‌ జావడేకర్‌

    - జేడీఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుని ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి- కర్ణాటక ఎన్నికల ఫలితాలపై పశ్చిమ్‌బంగా సీఎం మమత బెనర్జీ

    - అభివృద్ధికి ఓటు వేసిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు- నిర్మలా సీతారామన్‌

    - ప్రధాని మోదీపై నమ్మకంతోనే కర్ణాటక ప్రజలు భాజపాను గెలిపించారు.  

    - కర్ణాటకలోని తెలుగు ఓటర్లు భాజపాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు: 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు:కృష్ణంరాజు

    - కర్ణాటక రిజల్ట్‌@11.30: కాంగ్రెస్‌-65, భాజపా-105, జేడీఎస్‌-38, ఇతరులు-4 ఆధిక్యం(భాజపా ఏడు, కాంగ్రెస్‌ రెండు, జేడీఎస్‌ ఒక స్థానంలో విజయం)

    - షికారిపురలో యడ్యూరప్ప విజయం

    - కోలార్‌లో బీఎస్పీ అభ్యర్థి శ్రీనివాసగౌడ గెలుపు

    - మంగళూరులో యు.టి.అబ్దుల్‌ ఖాదర్‌(కాంగ్రెస్‌) విజయం

    - చిత్రదుర్గ జిల్లా హొళల్కెరెలో మంత్రి ఆంజనేయులుపై భాజపా అభ్యర్థి చంద్రప్ప విజయం

    - కర్ణాటక రిజల్ట్‌@11.00: కాంగ్రెస్‌-64, భాజపా-111, జేడీఎస్‌-44, ఇతరులు-2 ఆధిక్యం(భాజపా నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్‌ ఒకస్థానంలో విజయం)

    - కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బాదామిలో శ్రీరాములుపై 3వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉండగా, చాముండేశ్వరిలో 12వేలకు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

    - ప్రాంతీయ సెక్యులర్‌ పార్టీలను నాశనం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. కాంగ్రెస్‌ అంచనాలు తప్పడం వల్లే నేడు భాజపా దేశాన్ని పాలిస్తోంది. -దనిష్‌ అలీ(జేడీఎస్‌ నేత)

    - చిత్రదుర్గ జిల్లా చళ్లకెరెలో రఘుమూర్తి(కాంగ్రెస్‌)విజయం

    - జయాపజయాలపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. 11.30గంటల వరకూ వేచి చూడండి. -కార్యకర్తలను ఉద్దేశించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్పమొయిలీ

    - కుందాపురలో హాలాడి శ్రీనివాసశెట్టి(భాజపా)విజయం

    - ఉడుపి జిల్లా కాపు నియోజకవర్గంలో లాలాజీ ఆర్‌.మెండన్‌(భాజపా)విజయం

    - కర్ణాటక రిజల్ట్‌@10.30: కాంగ్రెస్‌-65, భాజపా-110, జేడీఎస్‌-42, ఇతరులు-1 ఆధిక్యం(భాజపా నాలుగు స్థానాల్లో విజయం)

    - కర్ణాటక: బెంగళూరులోని భాజపా పార్టీ కార్యాలయం ఎదుట భాజపా కార్యకర్తల సంబరాలు

    - మధ్యాహ్నం 1గంట తర్వాత దిల్లీలోని పార్టీ ఆఫీస్‌కు వెళ్లనున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా

    - రామనగర నియోజకవర్గంలో 1552 ఓట్లతో కుమారస్వామి ముందంజ

    - బళ్లారి సిటీలో బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖరరెడ్డి ఆధిక్యత

    - హడగళి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పరమేశ్వర నాయక్‌ ఆధిక్యం

     - బళ్లారి బెల్ట్‌ లో గాలి జనార్దనరెడ్డి సోదరుల హవా

    -  శికారిపురలో యడ్యూరప్ప ముందంజ

    -  శృంగేరిలో కాంగ్రెస్‌ కు ఆధిక్యం!
     
    - లింగాయత్‌ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం

    - హరప్పనహళిలో గాలి కరుణాకరరెడ్డి ముందంజ

    - ఆధిక్యంలో హెచ్‌డీ రేవణ్ణ (జేడీఎస్‌)

    - కనకపురలో శివకుమార్‌ (కాంగ్రెస్‌) ముందంజ

    - బాదామిలో ఆధిక్యంలోకి వచ్చిన సిద్దరామయ్య

    - చాముండేశ్వరిలో 6వేల ఓట్లతో వెనుకబడిన సీఎం సిద్దరామయ్య

    - చిత్తాపూర్‌లో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే ముందంజ

    - రెండు స్థానాల్లోనూ సీఎం సిద్దరామయ్య వెనుకంజ..

    - చాముండేశ్వరిలోనూ సీఎం సిద్దరామయ్య వెనుకంజ

    - బాదామిలో సీఎం సిద్దరామయ్య వెనుకంజ..

    - బాదామిలో సీఎం సిద్దరామయ్యపై బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ముందంజ

    - వరుణలో సీఎం తనయుడు యతీంద్ర ముందంజ

    - చిక్‌మగ్‌లూరులో సీపీ రవి (బీజేపీ) ముందంజ

    - బళ్లారిలో గాలిసోమశేఖరరెడ్డి (బీజేపీ) ముందంజ

    - రామనగరిలో కుమారస్వామి ముందంజ

    - కర్ణాటక: రామనగరలో కుమారస్వామి(జేడీఎస్‌)ఆధిక్యం

    - కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాగమంగళలోని ఆదిచుంచనగిరి మహా సంస్థాన మఠంలో జేడీఎస్‌ అధినేత కుమారస్వామి పూజలు

    - కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద యజ్ఞం నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు

    - ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (కాంగ్రెస్‌) చాముండేశ్వరి, బాదామి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (జేడీఎస్‌) చెన్నపట్టణ, రామనగర, లోక్‌సభ సభ్యుడు శ్రీరాములు(భాజపా) మొలకాల్మూరు, బాదామి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గాలపై రాష్ట్రమంతా ఆసక్తి చూపింది. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప తలపడిన శికారిపురలో ఆయన గెలుపు నల్లేరుపై బండి నడకేననే అంచనాలు ఉన్నాయి.

    - దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 222 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 

    - బెంగళూరులోని బీఎంఎస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద దృశ్యాలు. ఫలితాల నేపథ్యంలో 50వేలమంది పోలీసులతో కర్ణాటక అంతటా కట్టుదిట్టమైన భద్రత.

    - ఒకవైపు ఉండేలా ట్రెండ్ మొదలైంది. ఏదో ఒక పార్టీ గెలిస్తే ఓకే గాని హంగ్ వస్తే కర్ణాటకలో రాజకీయ కల్లోలం ఇపుడపుడే చల్లారేలా లేదు. ఎందుకంటే ఒకపుడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి హంగ్ వస్తే మంత్రి పదవులతో సరిపెట్టుకునే పరిస్థితి లేదు. 

    - ఈ నెల 12న జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు  కొనసాగుతోంది. 


    మరింత సమాచారం తెలుసుకోండి: