వైకాపా  అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టిస్తోంది . దేశంలో అనేక మంది ముఖ్యమంత్రి కొడుకులు సుఖానికి లగ్జరీ బతుకులకు అలవాటు పడితే...దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ తనయుడు వైఎస్.జగన్ ప్రజా సమస్యల కోసం మంచి కుర్ర వయసులోనే తన శక్తిని ప్రజాసమస్యల పోరాటం కోసం ఉపయోగించడం విశేషం.  ఇప్పటికే 8 జిల్లాలలో పాదయాత్ర చేసిన జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన సంగతి తెల్సిందే . ఈ క్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు రెండు వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన నేపద్యంలో పైలాన్ ని ఏర్పాటు చెయ్యడం మనం చూసాం. జగన్ పైలాన్ ని ఆవిష్కరించిన క్రమం లో పశ్చిమ ప్రాంతం అంతా పులకించింది.
Image may contain: 1 person, crowd
ప్రస్తుతం జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామాల వెంట..ప్రతి ఒక్కరినీ పలకరించుకుంటూ ఎక్కువగా రైతులతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరిజిల్లాలో వైకాపా ఒక్క స్థానం కూడా గెలవలేదు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే జిల్లాలో మొత్తం మీద ఎక్కువ  సీట్లు గెలిచే అవకాశాలు వైసీపీ పార్టీ కి ఉన్నట్లు కనపడుతోంది. జనం జగన్ కోసం ఎగబడి ఒస్తున్న తీరు చూస్తూ ఉంటె ఎవ్వరైనా ఈ విషయం ఒప్పుకుని తీరాల్సిందే. ఉదాహరణగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో జగన్ వస్తుండగానే ఆ నియోజకవర్గంలో ప్రజలు జగన్ కి నీరాజనం పట్టారు.
Image may contain: 18 people, people smiling, crowd and outdoor
జగన్ తన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ముందుకు సాగుతూ వారి సమస్యలు వింటూ ధైర్యం చెబుతున్నారు..మంచి రోజులు వస్తాయని ఓపిక పట్టమని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జగన్ పాదయాత్ర సందర్భంగా చాలా మంది ఇతర పార్టీ నాయకులు వైసీపీ పార్టీ లోకి రావడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలలో అబద్ధపు హామీలు చెప్పి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారు.
Image may contain: 6 people, people smiling
ఈ క్రమంలో పెద్దాపురం నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నాయకుడు బొడ్డు భాస్కర రామారావు టీడీపీ వీడాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తున్న చంద్రబాబు రాజకీయాలను తట్టుకోలేక వైసీపీలోకి వెళ్ళడమే మంచిదని ఆయన సన్నిహితులు అభిప్రాయపడడంతో ఈ మాజీ ఎమ్మెల్సీ, చంద్రబాబు సన్నిహితుడు అయిన నాయకుడు ఇప్పుడు వైసీపీ పార్టీ లోకి రావడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో వైసిపి పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. 
Image may contain: 5 people, people smiling, outdoor
గతం లో దెందులూరు ప్రాంతం లో వైకాపా ఛాయలు పెద్దగా కనపడేవి కాదు. చింతమనేని సీరియస్ రాజకీయాలు, బెదిరింపులు ఎక్కువగా ఉండడం తో వైకాపా వైపు వెళ్ళాలి అన్నా జన సమీకరణాలు చెయ్యాలి అన్నా వణికి పోయేవారు జగన్ సపోర్తర్ లు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా అద్భుతంగా మారింది. తెలుగు దేశం జండా భుజం మీద నుంచి దించి నెమ్మదిగా వైకాపా జండా మోసే వారి సంఖ్య ప్రభాకర్ ఇలాఖా లో ధైర్యంగా పెరిగింది అంటే ఇక పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు, ఒకే ఒక్క పాదయాత్ర తో ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు జనాలని ఎంతఃగా దగ్గరకి తెచ్చుకోవచ్చు అని రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్ నిరూపించాడు.. ఆయన కంటే గొప్పగా ఆయన కంటే తెలివిగా ! ఈ దెబ్బ తో చంద్రబాబు వెన్ను లో వణుకు పుట్టడం ఖాయం అని చెబుతున్నారు !!


మరింత సమాచారం తెలుసుకోండి: