ఆసియాలో అత్యంత సంపన్నుడు, అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట్లో మళ్ళీ పెళ్ళి వాయిద్యాలు వినపడబోతున్నాయి. ఇప్పటికే కవల పిల్లలయిన ఇషా అంబానీ, ఆకాశ్‌ అంబానీల పెళ్లిళ్లు నిశ్చయమై, నిశ్చితార్థ  వేడుకలు సైతం పూర్తవగా ఇప్పుడు చిన్న కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


ఇప్పటికే అనంత్, రాధిక కలిసి దిగిన ఒక ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మరీ వీరు ఇద్దరు చాలా సన్నిహితంగా మెలగడం వల్ల వీరిరువురు ఇప్పటికే నిశ్చితార్థం చేసేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఈ సంవత్సరం చివరి నెల డిసెంబర్లో వీరు వివాహ బంధంతో ఒక్కటవుతున్నలుగా వదంతులు వ్యాపించాయి. 


అయితే ఈ పుకార్లు వ్యాపించిన కొద్దిసేపటిలోనే సోషల్ మీడియాలో వీరి ఫోటోను తీసివేయడం కూడా పలు అనుమానాలకు తావునిస్తుంది. అయితే వీరి మీద వచ్చిన పుకార్లకు అంబానీ కుటుంబం నుండి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. కాగా ఇషా అంబానీ పిరమల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమల్‌ను, ఆకాశ్‌ అంబానీ ప్రముఖ డైమాండ్‌ వ్యాపారి కూతురు శ్లోకా మెహతాను ఈ సంవత్సరం డిసెంబరులో వివాహమాడబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: