కర్నాటకలో అధికారం ఎవరి చేపడతారనే విషయాన్ని పక్కనపెడితే అక్కడ బీజేపీ ఓడిపోవాలని తెలుగువాళ్లు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా కోరుకున్నారు. ఇందుకోసం ఏకంగా కర్నాటక వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి కొన్ని పార్టీలు.., కొంతమంది నేతలు.! తెలుగువారి కోరిక కర్నాటకలో ఫలించినట్లే ఉంది. వారి ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతింది.

Related image

          కర్నాటకలో తెలుగువాళ్ల ప్రభావం ఎక్కువే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సుదీర్ఘమైన సరిహద్దు కలిగి ఉంది కర్నాటక, తెలంగాణను పక్కనపెడ్తే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని జిల్లాల్లో తెలుగువాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ఏపీ ప్రజలు బలంగా కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మోసం చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీని ఓడించడం ద్వారా తెలుగువారి సత్తా ఏంటో చూపెట్టాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుకున్నారు. కొంతమంది నేరుగా వెళ్లి ప్రచారం చేయగా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు చాలా మంది.

Image result for bjp and tdp

          వారి క్యాంపెయిన్ బాగానే పనిచేసినట్లుంది. ఏపీ సరిహద్దులోని 5 జిల్లాల్లో మొత్తం 32 నియోజకవర్గాలున్నాయి. వాటిలో కేవలం 8 సీట్లలో మాత్రమే బీజేపీ గెలవగలిగింది. 25 సీట్లలో ఇతర పార్టీలు గెలిచాయి. రెండు జిల్లాల్లో అయితే బీజేపీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. కోలార్ లోని 6 నియోజకవర్గాలు, చిక్కబళ్లాపురలోని 5 సీట్లలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. రాయచూర్ లో 7 నియోజకవర్గాలుండగా బీజేపీకి 2 మాత్రమే వచ్చాయి. గాలి కంచుకోటగా పేరొందిన బళ్లారి జిల్లాలో కూడా బీజేపీ చతికిలపడింది. అక్కడ మొత్తం 9 సీట్లుండగా బీజేపీకి 3 మాత్రమే వచ్చాయి. కొప్పళ జిల్లాలో 5 సీట్లుండగా బీజేపీకి 3 దక్కాయి. ఓవరాల్ గా ఏపీ సరిహద్దు జిల్లాల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతింది. దీంతో.. ఆంధ్రుల ఆశ నెరవేరినట్లయింది.

 Image result for bjp and tdp

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న కర్నాటక జిల్లాలు – 5

5 జిల్లాల్లోని మొత్తం నియోజకవర్గాలు – 32

32 నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన సీట్లు – 8 మాత్రమే

రాయచూర్ జిల్లాలో మొత్తం సీట్లు – 7, బీజేపీకి వచ్చినవి – 2

బళ్లారిలో మొత్తం సీట్లు -9, బీజేపీకి వచ్చినవి – 3

కోలార్ లోని మొత్తం సీట్లు – 6, బీజేపీకి వచ్చినవి – 0

కొప్పల్ జిల్లాలో మొత్తం సీట్లు -5, బీజేపీకి వచ్చినవి – 3

చిక్కబళ్లాపురలో మొత్తం సీట్లు -5, బీజేపీకి వచ్చినవి - 0


మరింత సమాచారం తెలుసుకోండి: