కర్ణాటక లో ఎన్నికల ఫలితాలు ఎవరికీ సంపూర్ణ మద్దతు ఇవ్వక పోవడం తో  జేడీఎస్‌ సపోర్ట్ చాలా ముఖ్యం అయిపొయింది. ఇప్పటికే కాంగ్రెస్  జేడీఎస్‌కు సపోర్ట్ ఇస్తామని చెప్పింది. పైగా సీఎం కాండిడేట్ కూడా కుమార స్వామే అని చెప్పింది. దీనితో కుమార స్వామి కూడా ఒప్పుకున్నాడు. కనీసం నలభై సీట్లు కూడా రాని పార్టీ అధినేత కు సీఎం ఛాన్స్ రావడం తో సహజంగానే ఒప్పుకున్నాడు. అయితే బీజేపీ కర్ణాటకలో సింగల్ లార్జెస్ట్ పార్టీ గా అవతిరించింది. 

Image result for karnataka election

లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచినప్పటికీ, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. జేడీఎస్‌ను అడ్డం పెట్టుకుని బండి లాగించేయాలని చూస్తోంది. కుమారస్వామికి ముఖ్యమంత్రి సీటును ఎరగావేసి.. అతడిని సీట్లో కూర్చోబెట్టి, ఆ సీట్లోకి బీజేపీ వాళ్లు ఎక్కకుండా చూడాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారతీయ జనతాపార్టీ వాళ్లు కనీస మెజారిటీకి కాస్తదూరంలో ఆగిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇవన్నీ దింపుడు కళ్లెం ఆశలే అని వేరే చెప్పనక్కర్లేదు. కుమారస్వామి అయితే కాంగ్రెస్ ప్రయత్నాలకు ఊకొట్టాడట. సాయంత్రం వెళ్లి గవర్నర్‌ను కలుస్తాను అని అంటున్నాడట.

Image result for karnataka election

కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయత్నంలో కుమారస్వామి భాగం అవుతాడని తెలుస్తోంది. అయితే ఈ ఆటంతా బాగుంటుంది కానీ, షా చూస్తూ ఊరుకుంటాడా? అందుకే ఇప్పటికే వేరే వ్యూహంతో వెళ్తోందట బీజేపీ. జేడీఎస్‌లో కుమారస్వామి ఒకరే నేత కాదు కదా, దేవేగౌడ మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతడే రేవణ్ణ. ఇతడూ ఎమ్మెల్యేగా నెగ్గాడు. ఇతడికి డిప్యూటీ సీఎం ఇస్తామని ముందు నుంచినే బీజేపీ ప్రతిపాదనలు పంపిందట. ఇప్పుడు రేవణ్ణ వైపు నుంచి బీజేపీ నరుక్కొస్తోందని, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమందిని ఇటువైపు తిప్పుకోవడానికి మంత్రాంగం నడుస్తోందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: