కర్ణాటకలో హంగ్ ఏర్పడటం తో గవర్నర్ విచక్షణ అధికారం  ఇప్పుడు ముఖ్యము అయ్యింది. బీజేపీ సింగల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించింది. కానీ పూర్తి మెజారిటీ కి కొన్ని సీట్ల దూరం లో ఉండి పోయింది. మిగతా రెండు పార్టీ లు కాంగ్రెస్ అండ్ జేడీఎస్ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. అయితే ఏ పార్టీ కి అధికారం కట్ట బెట్టాలనే అంశం గవర్నర్ చేతి లో కి వచ్చింది. సింగల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలా.. లేదా సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలా అనేది గవర్నర్ నిర్ణయించే అంశం. 

Image result for karnataka governor

అయితే ఒక్కడ ఎక్కువగా అవకాశాలు బీజేపీ వైపే మగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే గవర్నర్ మోడీకి వీర విధేయుడు కాబట్టి. అలాంటి వీరవిధేయుడి చేతిలో ఇప్పుడు నిర్ణయాధికారం ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలా? లేదా, ఫలితాల అనంతరం పొత్తులు కుదుర్చుకున్న వారిని సంఖ్యాబలం ఆధారంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలా? అనేది ఆయన ఇష్టం. ‘ఇలాగే’ చేయాలనే చట్టం ఏదీ లేకపోయినప్పటికీ.. సాంప్రదాయం పాటించడానికి సాధారణంగా ప్రిఫరెన్సు ఇస్తారు.

Image result for modi

పైగా ఆయన మోడీ వీరవిధేయుడు అనేది తెలిసిన సంగతే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మోడీ అభీష్టానికి వ్యతిరేకంకగా నిర్ణయం తీసుకునే అవకాశంలేదు. ప్రస్తుతానికి ఆయన చేతిలోనే మంత్రదండం ఉంది. అది సాంప్రదాయాన్ని పాటించే ప్రకటనతో నిర్ణయం తీసుకుంటుంది. దానిని తమకు అనుకూలంగా మలచుకోవడం ఎలాగో తతిమ్మా మోడీ కోటరీ చూసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: