ప్ర‌తిప‌క్ష నేత హామీల‌పై చంద్ర‌బాబునాయుడులో ఆందోళ‌న మొద‌లైన‌ట్లే క‌న‌బ‌డుతోంది.  పాద‌యాత్ర సంద‌ర్భంగా జ‌గ‌న్ ఇస్తున్న హామీల విష‌యంలో జ‌నాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌మాట వాస్త‌వ‌మే. జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌పై జ‌నాల్లో మిశ్ర‌మ స్పంద‌న క‌నిపిస్తోంది. జ‌గ‌న్ హామీల అమ‌లుకు వేల కోట్ల రూపాయ‌లు కావాల‌ని టిడిపి నేత‌లంటున్నారు. అంత డ‌బ్బు ఎక్క‌డి నుండి తెస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆ విష‌యాన్నే శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చంద్ర‌బాబు కూడా బ‌హిరంగంగా లేవ‌నెత్తారు. జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. జ‌గ‌న్ హామీల‌ను న‌మ్మితే కుక్క‌తోక ప‌ట్టుకుని గోదావ‌రి ఈదిన‌ట్లు ఉంటుంద‌ని  ఎగతాళి కూడా చేశారు.

Image result for tdp

చంద్ర‌బాబు చేసిందేంటి ?
అంతా బాగానే ఉంది. మ‌రి, పోయిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల మాటేంటి ?  టిడిపి మ్యానిఫెస్టో చూసినా లేక‌పోతే ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల ప్ర‌కారం అయినా చంద్ర‌బాబు 600 హామీలిచ్చారు. అందులో ఆచ‌ర‌ణ సాధ్యంకాని హామీలు చాలానే ఉన్నాయి.  అందులో  రుణ‌మాఫీలు, నిరుద్యోగ భృతి, రాజ‌ధాని నిర్మాణం, పోల‌వ‌రం ప్రాజెక్టు, బెల్టుషాపుల నిర్మూల‌న‌, కాపుల‌ను బిసిలోకి చేర్చ‌టం, బోయ‌ల‌ను ఎస్టీ కులాల జాబితాలో చేర్చ‌టం లాంటి అనేక హామీలున్నాయి. అధికారం ఆందుకోవ‌ట‌మే ఏకైక ల‌క్ష్యంతోనే చంద్ర‌బాబు వంద‌లాది హామీలిచ్చార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 

Image result for ysrcp

నెర‌వేరిన హామీలెన్ని ?
చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో నెర‌వేరిన‌వి ఎన్ని? అన్న‌మాట‌కు తెలుగుదేశంపార్టీ నేత‌లే స‌రైన స‌మాధానం చెప్ప‌లేరు. ఎందుకంటే, ఏ ఒక్క హామీని కూడా చంద్ర‌బాబు సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేదు. రుణ‌మాఫి అంటే అందులో రైతు, డ్వాక్రా, చేనేత రుణాల‌మాఫీ చేయాలి. ఎన్నిక‌ల‌పుడు ఇచ్చిన హామీలు వేరు. అధికారంలోకి రాగానే అమ‌లు చేస్తున్న‌ది వేరు. రుణ‌మాఫీ వ‌ల్ల ఏ వర్గానికి కూడా పూర్తి ల‌బ్ది జ‌ర‌గ‌లేదు. నిరుద్యోగ‌భృతి అస‌లు అమ‌లే కాలేదు. బెల్టుషాపుల నిర్మాల‌న గురించి అంద‌రికీ తెలిసిందే. రాజ‌ధాని నిర్మాణం గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు.


కాపులను బిసిల్లో చేర్చారా ? 
త‌న హామీ ప్ర‌కారం చంద్ర‌బాబు కాపుల‌ను బిసిల్లో, బోయ‌ల‌ను ఎస్టీల్లో చేర్చారా ?  ఎన్నిక‌ల్లో ల‌బ్దికోస‌మే క‌దా చంద్ర‌బాబు కూడా ఈ హామీనిచ్చింది ?  కాపుల‌ను బిసిలో చేర్చ‌ట‌మైనా, బోయ‌ల‌ను ఎస్టీలో చేర్చ‌ట‌మైనా చంద్ర‌బాబు చేతిలో లేదు. ఒక కులాన్ని మ‌రో కులంలోకి చేర్చాల‌న్నా లేదా తీసేయాల‌న్నా కేంద్రం ఆమోద‌ముంటే త‌ప్ప సాధ్యంకాదు.  మ‌రి, ఆ విష‌యం తెలిసీ చంద్ర‌బాబు ఎలా హామీఇచ్చారు. అంటే అధికారంలోకి రావ‌టం కోస‌మే. 

Image result for jagan babu

చంద్ర‌బాబు బాట‌లోనే జ‌గ‌న్..
అభివృద్ధిని చూసి ఓట్లేసే స్ధాయికి జ‌నాలు ఎద‌గ‌లేద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. ఆచ‌ర‌ణ సాధ్యంకాని హామీలివ్వ‌కూడ‌ద‌న్న ఉద్దేశ్యంతోనే జ‌గ‌న్ పోయిన ఎన్నిక‌ల్లో అటువంటి హామీలివ్వ‌లేదు. అందుకే దెబ్బ‌తిన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌ట‌మ‌న్న‌ది జ‌గ‌న్ కు చావు బ్ర‌తుకుల స‌మ‌స్య‌. అందుక‌నే జ‌నాల‌ను ఆక‌ట్టుకోవ‌టానికి తాను కూడా చంద్ర‌బాబు బాట‌లోనే ప్ర‌యాణిస్తున్నారు. కాక‌పోతే జ‌గ‌న్ ఇస్తున్న హామీల అమ‌లంతా రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉండేట్లు చూసుకుంటున్నారు. జ‌నాలు కూడా జ‌గ‌న్ హామీల ప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతున్న‌ట్లు చంద్ర‌బాబుకు అనుమానం మొద‌లైన‌ట్లుంది. అందుకే జ‌గ‌న్ హామీల విష‌యంలో చంద్ర‌బాబులో ఆందోళ‌న క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: