రాజకీయాల్లో నైతికత కోసం వెతకటమంటే "గొంగట్లో కూర్చొని తింటూ వెంట్రుకలు ఏరుకోవటమే" నని అర్ధమౌతుంది. మొత్తం దేశంలో ఏఒక్క రాజకీయ పార్టీ కూడా సరైన ప్రజాస్వామ్యపాలన ఇవ్వట్లేదని నిర్ద్వంధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే మూలాల్లోనే లోపాలు చోటుచేసుకుంటున్నాయి.  అవినీతి అక్రమాలు వాటి రూపాలు శతావతారాలై ప్రజాజీవితంపై అత్యంత దౌర్భాగ్య పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు కర్ణాటక వేర్వేరు రాజకీయ పార్టీలు  తీసుకున్న 'మలుపు'  చెప్పుకోవచ్చు. 

formation of karnataka government కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు కర్ణాటక రాజకీయం రసకందాయకంలో పడింది. ప్రజలు తీర్పిచ్చారు. వారిచ్చిన అస్పష్టమైన ఎన్నికల ఫలితాలకు వారు మాత్రం కారణం కాదు. అలా జరగట మే ప్రజాస్వామ్య లక్షణం. కాకపోతే ఈ పార్టీల మద్య సర్ధుబాట్లకు ఎన్నికల ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని, సిద్ధాంతాల వైరుధ్యాన్ని తగ్గించుకొని ఉండక పోవటం క్షమించరానిది. ఇది న్యాయమేనా?  ప్రజాభిప్రాయం ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిబింబించబడాలి. అదే జరగట్లేదు.

yeddyurappa and karnataka governor కోసం చిత్ర ఫలితం
అయితే ఇప్పుడు 38శాసనసభ స్థానాలు కలిగిన జెడిఎస్ కు ప్రభుత్వం ఏర్పాటు చెసే అవకాశం ఎంతవరకు సబబు?  అలాంటి స్వల్ప సంఖ్య సభ్యులున్న పార్టీకి 78శాసనసభ స్థానాలు కలిగిన పార్టీ వెలుపల నుండి మద్దతు ఇవ్వటం సరైనదేనా? అదే తన 78సభ్యులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చెస్తే, దానికి వెలుపల నుండి జెడిఎస్ మద్దతు నిస్తే, అది కొంతవరకు సబబు ఔతుంది. సంకీర్ణంలో నైనా పెద్ద సంఖ్య సభ్యులున్న పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటంలో కొంత న్యాయం కనిపిస్తుంది. అలా కాకుండా వేరెవిధంగా జరిగితే ప్రజాస్వామ్యానికి న్యాయం జరగనట్టే. 
formation of karnataka government కోసం చిత్ర ఫలితం
అంతే కాదు గతంలో కూడా కుమారస్వామికి అంటే జెడిఎస్ కు కాంగ్రెస్ నేత ధరం సింగ్ ప్రభుత్వాలను పంచుకున్నప్పుడు పాలన ఇబ్బందుల్లో పదింది. అందుకనే అలాంటి పరిస్థితులు ఇప్పుడు పునరావృతం ఔతున్నందుక కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవటం అవసరం. అప్పుడు సంకీర్ణం కూలిపోవటానికి కారణం కుమారస్వామి మాత్రమె. సంకీర్ణంలో గతచరిత్ర చూడటం ఇప్పటికైనా మంచిది. హార్స్-ట్రేడింగ్ ఆపటం చాలా అవసరం.  

సంబంధిత చిత్రం


ఇక్కడ గత అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఒకనాడు ఇదే కాంగ్రెస్ కు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి తీరు మొత్తం కర్ణాటకకు తెలుసు. ఇప్పుడు ఈయన స్వప్రయోజనాలను ఆశించే ప్రభుత్వఏర్పాటుకు కాంగ్రెస్తో కలసిముందుకు సాగుతున్నవైనం దానిని కాంగ్రెస్ అంగీకరించటం లోని కుతంత్రం కూడా ప్రశ్నించ తగ్గదే. 
yeddyurappa and karnataka governor కోసం చిత్ర ఫలితం

ఇవే రసవత్తర రాజకీయానికి కారణం అవుతున్నాయి. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.ఇదే సమయంలో ఎవరికివారు పీఠాన్ని దక్కించు కోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ప్రయత్నాలు అన్నీ తెరచాటున సాగుతుండటం గమనార్హం. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారా లకు తెర లేచినట్టుగా స్పష్టం అవుతోంది. 
formation of karnataka government కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బాజపా యడ్యూరప్పకు సమీపంలోకి వచ్చారనే ప్రచారం బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ లోని లింగాయత్ సామాజికవర్గ  ఎమ్మెల్యే లను యడ్యూరప్ప తన వైపుకు తిప్పుకుంటున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. 'కుమారస్వామి' సీఎం కావడం 'లింగాయత్ ఎమ్మెల్యే'లకు ఇష్టం లేదని, దీంతో వారు కాంగ్రెస్‌ ను వీడి బీజేపీ వైపుకు చూస్తున్నారని ఒక బలమైన ప్రచారం ముమ్మరంగా ఉంది. వీరి సంఖ్య ఎనిమిది అని ఒక ప్రచారం సాగుతుండగా, ఐదుగురు యడ్యూరప్పతో ఇప్పటికే సమావేశం అయ్యారని ఇంకో ప్రచారం జరుగుతోంది. 
formation of karnata government కోసం చిత్ర ఫలితం
బెంగళూరులో జరుగుతున్న 'సీఎల్పీ మీటింగ్‌' కు గెలిచిన అభ్యర్థులు అంతా రాలేదనే సమాచారం స్పష్టంగా ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. 78మంది ఎమ్మెల్యే లు గెలవగా వీరిలో యాభైమంది మాత్రమే సీఎల్పీ మీటింగ్‌కు హాజరయ్యారని అంటున్నారు. మిగతావారు సీఎల్పీ మీటింగ్‌ కు వచ్చే దారిలో ఉన్నారా? లేక సీఎల్పీ మీటింగ్‌ నుండి దారి తప్పించుకొని వేరే దారికి మార్చారా? అనే అంశంపై మరి కొన్నిగంటల్లో స్పష్టత రానుంది. వీరిని కాంగ్రెస్ పార్టీ నే ప్రత్యేక క్యాంపుకు తరలించిందని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది.  

అలాగే జేడీఎస్‌ పైనా 'బీజేపీ ఆకర్ష్ వల పడిందీ అని సమాచారం. దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆకట్టు కోవడానికి కూడా బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు యడ్యూరప్ప రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
సంబంధిత చిత్రం

అయితే పరిస్థితులు ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుస్తున్న దాఖలాలే కనిపిస్తున్నాయి. 104 శాసనసభా స్థానాలు ఉంది 9శాసన సభ స్థానాలు తక్కువ మాత్రమే ఉన్న తమ కే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమివ్వాలన్నట్లు తెలుస్తుంది. 

karnataka election results 2018 కోసం చిత్ర ఫలితం

తొలుత ప్రభుత్వం ఏర్పాటుచెసే అవకాశం అత్యధిక స్థానాలు పొందిన పార్టీకే యివ్వాలి. గత సాంప్రదాయాలు చూపిస్తూ మళ్ళా తప్పుడు పని తిరిగిచేయటం కూడా న్యాయం కాదు. ధర్మ సమ్మతమూ కాదు. అలా తప్పు జరిగి ఉంటే దానిపై రాజ్యాంగపరంగా పోరాడాలి. కాని తప్పును కొనసాగించటం రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి ధర్మం కూడా కాదు. 

karnataka election results 2018 కోసం చిత్ర ఫలితం

అంతే కాదు అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ అంటే బిజెపి ప్రభుత్వ బలనిరూపణ రాజ్యాంగపరంగా జరిగిందని నిశ్చయం చేయాల్సిన కనీస బాధ్యత కూడా రాష్ట్ర గవర్నర్దే.  అలా జరగని నాడు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చేస్తే జెడిఎస్ వెలుపల నుండి మద్దతు ఇచ్చే విధానంలో ప్రభుత్వ ఏర్పాటును అనుమతించితే అది సత్యం అవుతుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: