దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠత రేపిన కన్నడ ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వచ్చాయి.  మొదటి నుంచి గెలుపు అంచులో ఉన్నామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ ఉన్నట్టుండి సందిగ్ధంలో పడిపోయే పరిస్థితి వచ్చింది.   జేడీఎస్ కి తక్కువ మెజార్టీ వచ్చినా..అనూహ్యంగా కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడంతో బీజేపీ మెజార్టీని డామినేట్ చేసే పరిస్థితి చేరుకుంది.  ఒక విధంగా నిన్న గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అర్జీ కూడా పెట్టుకుంది.  
 కర్ణాటక రాజకీయం క్షణక్షణానికి ఊహించని మలుపు తిరుగుతోంది.
Image result for karnataka elections
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జేడీఎస్‌కు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నేడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని పార్టీ ఆదేశించింది. కర్ణాటక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 8 అడుగులు (ఎమ్మెల్యేలు) దూరంలో నిలిచిపోయిన బీజేపీ... ఎలాగైనా సరే అధికారపీఠాన్ని అధిష్టించాలనే కృతనిశ్చయంతో ఉంది. 


ఈ నేపథ్యంలో, ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారని తెలుస్తోంది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమైనట్లు తెలిసింది. ఈ పరిణామంతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ వీరిని వెతికే పనిలో ఉన్నట్లు సమాచారం. కనిపించకుండాపోయిన నలుగురు ఎమ్మెల్యేల కోసం హెలికాఫ్టర్‌తో బీదర్, కలబురిగి ప్రాంతాల్లో గాలిస్తున్నట్లు తెలిసింది. 


 ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేరని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భీమానాయక్, అమెర్ గౌడ నాయక్ లు బీజేపీకి మద్దతు ప్రకటించినట్టు విశ్వసనీయ సమాచారం. వీరి కోసం బీదర్, గుల్బర్గాలకు బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక హెలికాప్టర్లను పంపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, బెంగళూరు రాజకీయం మరింత వేడెక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి: