కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఏరాజకీయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సింహాసనాన్ని అధిరోహించాలి అని ప్రయత్నాలు చేస్తున్న యడ్యూరప్ప కుమారస్వామిల మధ్య ‘కిస్సా కుర్సీకా’ రేస్ నడుస్తోంది. ఈ  నేపధ్యంలో ఈ రాజకీయ హైడ్రామాకు హీరోగా కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ప్రస్తుతం నేషనల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారారు. 

అయితే చాలామందికి తెలియని ఈయన వ్యక్తిత్వం గురించి ఇప్పుడు అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వజుభాయ్ వాలా పక్కా గుజరాతీ. అమిత్ షాకు మోడీకి చాలా సన్నిహితుడు అన్న పేరుంది. ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన పక్కా హిందుత్వవాది. 2012 నుంచి 2014 దాకా గుజరాత్ స్పీకర్ గా పనిచేసిన ఈయన ఇందిరాగాంధీ హయాంలో వచ్చిన ఎమర్జెన్సీ సమయంలో 11 నెలల పాటు జైలుకు వెళ్ళి వచ్చిన పక్కా జనసంఘ్ వాది. 
KARNATAKA GOVERNOR WAJU BHAI WALA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
రెండుసార్లు గుజరాత్ ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈయనకు మోడీ దయతో కర్ణాటక గవర్నర్ గా నియమించబడ్డారు అన్న వార్తలు ఉన్నాయి. దీనితో   కరుడుగట్టిన బీజేపీ వాదిగా పేరు ఉన్న ఈయన  కాంగ్రెస్ జేడీఎస్ లకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాసం ఇవ్వడం కష్టమే అన్న అభిప్రాయాలను జాతీయ మీడియా వ్యక్త పరుస్తోంది.  

ఇది ఇలా ఉండగా ఈరోజు బీజేపీ – కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల శాసన సభ్యుల సమావేశాలు వారివారి పార్టీల కార్యాలయాల్లో జరిగాయి. అయితే ఈ సమావేశాలకు  కాంగ్రెస్ జేడీఎస్ పార్టీ శాసన సభ్యులలో కొందరు హాజరు కాకపోవడంతో అప్పుడే ఎమ్.ఎల్.ఏ ల బేరసారాలు ప్రారంభం అయ్యాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న కుమారస్వామి ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒకొక్క ఎమ్.ఎల్.ఏ కు బిజేపీ వైపు రావడానికి 100 కోట్ల డబ్బును అదేవిధంగా మంత్రిపదవిని ఎర వేస్తున్నారు అంటూ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనితో కర్ణాటక హంగామా చుట్టూ రాజకీయ హైడ్రామా నడుస్తున్న నేపధ్యంలో గవర్నర్ చెప్పబోయే తీర్పు కోసం దేశం యావత్తూ ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: