సాధారణంగా ఇండ్లల్లో చాలా మందికి జంతువులను పెంచుకోవడం ఇష్టం.  ముఖ్యంగా రక రకాల కుక్కలను పెంచుకుంటారు..కొంత మంది రక్షణ కోసం అయితే మరికొంత మంది ముద్దు కోసం పెంచుకుంటారు.  తాజాగా ఓ మహిళ నల్లగా ముద్దుగా ఉందని ఓ కుక్కపిల్లను సాకింది..తీరా అది పెద్దది కాగానే కుక్క పిల్ల కాదు..ఎలుగుబంటి అని తెలుసుకొని షాక్ తిన్నది...ఈ సంఘటన  చైనాలోని యునాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్న పప్పీ డాగ్‌ను రెండేళ్ల క్రితం ఇంటికి తెచ్చుకుంది చైనా మహిళ. 


నల్లగా బొద్దుగా ముద్దుగా ఉందికదా అది కుక్కపిల్లే అనుకొని  భావించి ఇంటికి తెచ్చుకున్న ఆమెకు రెండేళ్ల తర్వాత అది పప్పీ కాదని ఎలుగుబంటి అని తెలిసింది. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చింది. ఇక అటవీ శాఖాధికారులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని ఆ ఎలుగుబంటిని బోనులో బందించారు. ఆ ఎలుగుబంటి చాలా ప్రమాదకరమైందని తెలిపారు. ఆ ఎలుగుబంటి రోజుకు రెండు బకెట్ల న్యూడిల్స్ తినేదని.. దానికి లిటిల్ బ్లాక్ అని పేరు పెట్టుకుని పెంచుకున్నానని..కానీ కొన్నిరోజుల తర్వాత దాని బరువు 200 కేజీలకు చేరుకుంది. 


దీంతో ఆ మహిళకు అనుమానం వచ్చి పప్పీని పరిశీలించింది. అంతే అది కుక్క పిల్ల కాదు ఎలుగుబంటి అని తెలుసుకుంది. భయంతో ఆ మహిళ అటవీ అధికారులకు సమాచారం అందించానిన ఆ మహిళ తెలిపింది.
దీంతో ఆ కుక్క‌పిల్ల.. సారీ ఎలుగు బంటి క‌థ అలా స‌మాప్త‌మ‌యింది. ఇకనైనా ఏవైనా జంతువులను తెచ్చుకొని పెంచుకునే ముందు జాగ్రత్తగా గమనించి పెంచుకోండి అని ఫారెస్టు శాఖ వారు అన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: