కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను ప్రకటించింది.  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణను రెండు అవార్డులు వరించాయి.  ఘనవ్యర్థాల నిర్వహణలో రాష్ట్రల రాజధానుల జాబితాలో హైదరాబాద్‌కు తొలిస్థానం లభించింది. లక్షకు పైగా జనాభాగల పట్టణాల జాబితాలో ఉత్తమ పట్టణంగా సిద్ధిపేటకు అగ్రస్థానం దక్కింది.
Telangana gets two awards in Swachh Survekshan 2018
ఇక.. పరిశుభ్రమైన నగరాల జాబితాలో ఇండోర్‌కు మొదటి స్థానం రాగా.. భోపాల్‌కు రెండో స్థానం.. చండీగఢ్‌కు మూడో స్థానం లభించింది. 10 లక్షలకు పైగా జనాభా నగరాల జాబితాలో ఉత్తమ నగరంగా విజయవాడ ఎంపికైంది.

పదిలక్షల జానాభా జాబితాలో విజయవాడకు అగ్రస్థానం లభించింది. పరిశుభ్రత పాటించడంలో విజయవాడ మొదటిస్థానంలో నిలిచింది. లక్ష పట్టణ జనాభా జాబితాలో సిద్దిపేటకు అగ్రస్థానం దక్కింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌ విభాగంలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.



మరింత సమాచారం తెలుసుకోండి: