పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజమైన పవర్ లోకి వస్థాడు అంటూ లేచిన వదంతులు, ఆయన పై పెట్టుకున్న సినీ ప్రముఖులు, సినీ జనాల ఆశలు ఆవిరయ్యే పరిస్థితులే కనిపిస్థున్నయంటున్నారు రాజకీయపరిశీలకులు. అన్నపై కోపమో... లేక రాజకీయంపై మమకారమో తెలియదు కాని పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లోకి రావడానికి ఆసక్థిని మాత్రం కనపరిచాడు.

అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రోజురోజుకు రాజకీయాల్లో మారుతున్న సోదరుడు చిరంజీవి పరిస్థితి పవన్ ఆశలు మదిని దాటకముందే మాయం చేసాయి అంటున్నారు సినిమారంగంలోని ఆయన సన్నిహితులు కొందరు. అందుకే పాపం పవన్ కళ్యాణ్, రాజకీయాల కారణంగా ఇటు సినిమాల్లోను కష్టాల పాలుకాగా ఇప్పుడు ఆయన చిరకాల వాంఛ రాజకీయ అరగేంట్రం కూడా ప్రశ్నార్థకంగా మారి ఎటు కాకుండా పోయే పరిస్థితుల్లో పడ్డాడన్నది సిని, రాజకీయవర్గాల ఉవాచ.

అత్తారింటికి దారేది సినిమా విడుదలను కష్టాల్లో పడేసింది ఈ రాజకీయాలే, చిరంజీవి సోదరుడు కావడమే ఈ కష్టానికి కారణమన్నది వేరే చెప్పక్లర్లేదు. ఆయన రాజకీయాల్లోకి వస్థే ఇప్పుడెలా రావాలి, సీమాంధ్ర పార్టీ పెట్టడమా... తెలంగాణ పార్టీ పెట్టడమా.. అటూ ఇటూ కాకుండా హైదరాబాద్ పార్టీ పెట్టడమా.. ఈ మూడింటిలో ఏ ఆలోచన చేసినా పవన్ కళ్యాణ్ సినిమా జీవితం గంగలో కలిసిపోతుంది. అలా కాకున్నా చిరంజీవి ఇప్పుడు ఇటు తెలంగాణాలోను అటు సీమాంధ్రలోను ప్రజల ఆగ్రహాన్ని తీవ్రంగా మూటగట్టుకున్నందున అది కూడా పవన్ సినిమాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని కూడా అంటున్నారు. అందుకే ఇప్పుడు ఎవరి నోట విన్నా పాపం పవన్ కళ్యాణ్.. అన్న మాటలు వినిపిస్తున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: