ఎప్పుడూ లేనంతగా ఈ సారి కర్ణాటక ఎన్నికలు ఓ రేంజిలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఒకవైపు దక్షిణాదిలో మొదటిసారి అధికారాన్ని సాధించి ఇక్కడ కూడా తన జెండా పాతాలని బీజేపీ భావిస్తే, మరోవైపు ఎలాగైనా అధికారాన్ని నిలుపుకొని తన సత్తాను చూపించాలనుకుంది కాంగ్రెస్. అయితే ఫలితాల రోజు రాజకీయనేతల  అంచనాలన్నీ తారుమారయ్యాయి.


రాజకీయ విశ్లేషకులు ముందే ఊహించినట్టు, చెప్పినట్టుగా హంగ్ ఏర్పడింది. బీజేపీ 104, కాంగ్రెస్ 78 సీట్లు దక్కించుకోగా జేడీఎస్ 38 సీట్లు దక్కించుకుని ఎవరూ అధికారాన్ని చేప్పట్టకుండా హంగ్ తలెత్తింది. ఇక బీజేపీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సాధారణ మెజారిటీని సాధించడంలో విఫలమయింది. ఇంకేముంది బీజేపీ, జెడియస్ లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి.


కాగా నేడు జెడియస్ పార్టీ  కుమారస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎనుకున్న సమావేశంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరకపోవడం పలు అనుమానాలకు తావునిస్తుంది. అంతేగాక కాంగ్రెస్ కూడా తమ పార్టీ కార్యాలయంలో ఎమ్యెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా 12మంది ఎమ్యెల్యేలు గైర్జాహారయినట్లు తెలుస్తుంది. ఈ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కొంపతీసి బీజేపీ కాంపౌండ్ లో తిరుగుతున్నారేమో అని ఇరు పార్టీల వారు వేటను కొనసాగిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: