వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం 8 జిల్లాలో ముగించుకుని ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర జగన్ రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పశ్చిమ వైసీపీ కార్యకర్తలు ప్రజలు ఎంతగానో సంతోషించి పైలాన్ ని ఆవిష్కరించారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో వైయస్ జగన్ కి వస్తున్న ఆదరణను చూస్తుంటే కచ్చితంగా రాబోయే ఎన్నికలలో..చాలా మెజార్టీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడేటట్లు ఉన్నాయి.

Image may contain: 1 person, crowd and outdoor

గత ఎన్నికలలో ఈ జిల్లాలో  ఒక్క స్థానం కూడా గెలవని వైసిపి ఈసారి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది అని అంటున్నారు రాజకీయ పెద్దలు..దానికి కారణం కూడా ఉంది పశ్చిమగోదావరి జిల్లా అంటే ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా పంటపొలాలతో శాంతి వాతావరణం తో నిండుకొని ఉంటుంది. కానీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ గోదావరి జిల్లా లో ఇప్పటి వరకు 7 హత్యలు పట్టపగలు నడిరోడ్డు మీద జరగడం బాధాకరం...దీంతో హత్యా రాజకీయాలను ప్రోత్సహించే తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో ఇంటికి పంపించాలి అనుకుంటున్నారు పశ్చిమ వాసులు. జగన్ చేస్తున్న పాదయాత్రలో ఎక్కువగా చంద్రబాబు చేతిలో ఏ విధంగా మోసపోయారో జిల్లావాసులు తమ బాధను వెళ్ళబుచ్చుతున్నారు..గత ఎన్నికలలో జిల్లాను అభివృద్ధి చేస్తారని మెజారిటీ స్థానాలు అందజేస్తే ఇప్పటివరకు పశ్చిమగోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదని వాపోయారు.

Image may contain: 8 people, crowd and outdoor

జగన్ ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న అవినీతిపై దెందులూరు వాసులు వాస్తవాలు బయటపెట్టారు. ఈ క్రమంలో ప్రజా సమస్యల కోసం జరిగిన సభలో భ‌ట్టు రాజు అనే వ్య‌క్తి మాట్లాడుతూ.. జ‌గ‌న్ అన్నా.. నేను దెందులూరి నివాసిని.. మా ప్రాంత‌ ప్ర‌జ‌లకు ఎస్సీ, క్రైస్త‌వ కోప‌రేటివ్ సొసైటీలోని ఏడు చెరువు ప‌రిధిలో ఉన్న 360 ఎక‌రాల భూమిని గ‌త 30 సంవ‌త్స‌రాలుగా సాగు చేస్తున్నాం. కానీ, ఇటీవ‌ల కాలంలో ఆ భూముల‌పై మా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ క‌న్ను ప‌డింది. తన అనుచరులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని తన ఆవేదన తెలియజేశారు.

Image may contain: 3 people

దీంతో జగన్ వెంటనే స్పందించి చింతమనేని ప్రభాకర్ పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి.. ముఖ్యమంత్రి దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కన్నుసాన్నుల మధ్య దాకా జరుగుతుందని తెలియజేశారు. అధికారంలో ఉన్నాం కదా అని సామాన్య ప్రజల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. దేవుడి దయ మీ అందరి అండతో రాబోయే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వస్తే ఇటువంటి నాయకులను కచ్చితంగా జైల్లో చిప్పకూడు తినిపిస్తానని...జగన్ హామీ ఇచ్చారు..అలాగే ఎవరి భూములు వారికి ఇచ్చే కార్యక్రమాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ ఇచ్చిన హామీతో అక్కడున్న ప్రజలంతా హర్షధ్వానాలతో సభను హోరెత్తించారు. మొత్తంమీద జగన్ పాదయాత్రకు పశ్చిమగోదావరి జిల్లాలో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: