అంతా అనుకున్నట్టుగానే కర్ణాటక ఎన్నికల ఫలితాలు హంగ్ తో ముగిసాయి. బీజేపీ నూటఎనిమిది స్థానాలు సాధించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కి కూసింత దూరంలో ఆగిపోవడంతో స్వచ్ఛమైన మెజారిటీ రాకా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో పడింది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఇరువురు కలిసి తమకు సంపూర్ణ మెజారిటీ ఉంది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వమని గవర్నర్ ను కోరగా, ఇటు బీజేపీ తాము అతి పెద్ద పార్టీ కావడంతో తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వమని కోరడం జరిగింది.


అయితే గవర్నర్ అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీవైపే  మొగ్గుచూపుతాడు అని ఊహాగానాలు సైతం వచ్చాయి. అందులోనూ మోడీకి విధేయుడు కావడంతో ఆ అనుమానం మరింత బలపడింది. అయితే  అందరూ ఊహించినట్టుగానే గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని యడ్యూరప్పను ఆహ్వానించాడు. పదిహేను రోజుల్లోగా బలపరీక్షను నిరూపించుకోవాలని ఆయనకు డెడ్ లైన్ విధించాడు. కాగా నేడు 9 గంటలకు గవర్నర్ సమక్షములో యెడ్డీ సీఎం గా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు.


మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు సంబందించి గవర్నరు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ న్యాయపరమైన చర్యలకు సిద్దమయింది. నిన్న రాత్రి కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సభ్యుల బృందం సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను కలిసింది. కర్ణాటక గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం చాలా తీవ్రమైన అంశమని, దీన్ని  అర్ధరాత్రే విచారణకు స్వీకరించాలని ఆయనని కోరింది. ఈయనను కలిసిన అనంతరం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ కార్యాలయం చేరుకున్న వీరు కేసును నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: