కర్ణాటక ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారణానికి గవర్నర్ ఒప్పుకోవడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. అస్సలు బీజేపీ కి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కానీ గవర్నర్ బీజేపీ కి అవకాశం ఇచ్చి బల నిరూపణ నిరూపించుకోవాలని ఆదేశించాడు. అంటే వేరే పార్టీల ఎమ్యెల్యే లను తమ పార్టీ లోకి లాక్కోదానికి టైం ఇచ్చినట్లా అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ మరియు జేడీఎస్ ప్రభుత్వానికి కావాల్సిన ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడు వారికి ఇవ్వాల్సింది అని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

Image result for karnataka governor

అయితే మోడీ కి గవర్నర్ వీర భక్తుడు కావడం వలనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. రాజ్యంగా బద్దమైన పదవిలో ఉండి  ఇటువంటి విధానాలు , ఒక పార్టీ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి దెబ్బ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు వారికి అవకాశం ఇవ్వడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పవచ్చు. ఇది ప్రజా తీర్పు ను అపహేళన చేయడం కాదా..!

Image result for karnataka governor

గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం వలన కాంగ్రెస్ మరియు జేడీఎస్ పార్టీ నుంచి జంపింగ్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ప్రమాణస్వీకారానికి యడ్యూరప్ప రంగంసిద్ధం చేసుకోగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు గాయబ్ అనే వార్తలు వస్తున్నాయి. సీఎల్పీ సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు మొహం చాటేశారని తెలుస్తోంది. వీరి సంఖ్య ఐదారుగురు వరకూ ఉందని సమాచారం. గాలి జనార్ధన్ రెడ్డి బ్రదర్స్‌కు సన్నిహితులు అయిన హైదరాబాద్ కర్ణాటక ప్రాంత ఎమ్మెల్యేలు జంప్ అని.. వీరు శ్రీరాములుకు టచ్లోకి వెళ్లారని.. వీరిపై కాంగ్రెస్ పార్టీ ఇక ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: