క‌ర్నాట‌క 24వ ముఖ్య‌మంత్రిగా బిఎస్ య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈమేర‌క‌కు రాజ్ భ‌వ‌న్ వ‌ర్గాలు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశాయి. ఈరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ప్ర‌స్తుతం ఒక్క‌రే ప్ర‌మాణం చేసిన య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా బ‌ల‌ నిరూప‌ణ త‌ర్వాత మాత్ర‌మే మంత్రివ‌ర్గం ఏర్పాటు చేస్తార‌ని స‌మాచారం. బ‌ల నిరూప‌ణ‌కు య‌డ్యూర‌ప్ప‌కు గ‌వ‌ర్న‌ర్ 29వ తేదీ వ‌ర‌కూ గ‌డువిచ్చిన సంగ‌తి అందిరికీ తెలిసిందే.
 Image result for karnataka elections
బుధ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ అనేక కీల‌క పరిణామాలు చోటు చేసుకున్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం బిజెపికే అనుకూలంగా రావ‌టంతో య‌డ్డీ ప్ర‌మాణ‌స్వీకారానికి లైన్ క్లియ‌రైంది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ సుప్రింకోర్టును కూడా ఆశ్ర‌యించింది. య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారాన్ని తాము అడ్డుకోలేమ‌ని సుప్రింకోర్టు తేల్చి చెప్పిన నేప‌ధ్యంలో బిజెపి నేత‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. 

Image result for karnataka elections

క‌ర్నాట‌క ఎన్నిక‌లు ఒక విధంగా హంగ్ ఫ‌లితాలే వ‌చ్చింది. సొంతంగా అధికారంలోకి రావటానికి ఏ ఒక్క పార్టీకీ జ‌నాలు పూర్తిస్ధాయిలో సీట్ల‌ను క‌ట్టబెట్ట‌లేదు. 222 స్ధానాల‌కు జరిగిన ఎన్నిక‌ల్లో అతిపెద్ద పార్టీగా బిజెపికి 104 స్ధానాలు, కాంగ్రెస్ కు 78 సీట్లు రాగా మూడో స్ధానంలో ఉన్న జెడిఎస్ కు 38 సీట్లు ద‌క్కాయి. దాంతో రెండు రోజుల పాటు అధికారం కోసం ర‌స‌వ‌త్త‌ర‌మైన నాట‌కానికి తెర‌లేరింది. కౌటింగ్ స‌ర‌ళిని గ‌మ‌నించిన త‌ర్వాత అనేక పార్టీల్లో నాట‌కీయ ప‌రిణామ‌లు జ‌రిగాయి. ఇటు బిజెపి అటు కాంగ్రెస్ జెడిఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేశాయి.
Image result for karnataka elections
కాక‌పోతే సాధ్యం కాలేదు. అందుక‌నే సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాలో బ‌ల నిరూప‌ణ చేసుకునేందుకు గ‌వ‌ర్న‌ర్ మొద‌టి అవ‌కాశాన్ని బిజెపికి ఇచ్చారు. అందులో భాగంగానే య‌డ్యూర‌ప్ప ఈరోజు సిఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా లు గై ర్హాజ‌రైనా కేంద్ర‌మంత్రులు ప్ర‌కాశ్ జ‌వ‌దేవ్ క‌ర్, జెపి న‌డ్డా, అనంత‌కుమార్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: