అనూహ్య పరిణామాలు, నాటకీయ మలుపుల అనంతరం... యడ్యూరప్ప మూడో సారి కర్ణాటక సీఎం కుర్చీ ఎక్కారు. 23వ ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ప్రమాణస్వీకారం చేశారు. అన్యాయం జరగుతోందని అడ్డుకోండీ అంటూ కాంగ్రెస్-JDS అర్థరాత్రి సుప్రీం కోర్టు తలుపు తట్టినా.. ప్రమాణస్వీకారాన్ని అడ్డుకోలేకపోయారు. రాజ్ భవన్ లో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారోత్సవం జరగగా..... కాంగ్రెస్-JDS నేతలు ఆందోళన బాటపట్టారు.

Image result for yeddyurappa

రాజ్‌భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో యడ్యూరప్పతో గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ప్రమాణం చేయించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పగ్గాలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రకాశ్‌ జవదేకర్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా నిలిచింది. మ్యాజిక్ ఫిగర్ కు 8 సీట్ల దూరంలో ఉండడంతో... కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకున్నాయి. కానీ గవర్నర్ వాజుభాయ్ వాలా మాత్రం మొదట యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారు. గవర్నర్ నిర్ణయంతో విభేదించిన కాంగ్రెస్-జేడీఎస్..... ప్రమాణస్వీకారాన్ని నిలుపుదల చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు పిటిషన్ పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో కూడా లైన్ క్లియర్ కావడంతో... యడ్యూరప్ప మూడో సారి సీఎంగా ప్రమాణం చేశారు. అది కూడా ఒంటరిగా.!

Image result for yeddyurappa

ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు బీజేపీకి అవకాశమిచ్చిన గవర్నర్... అసెంబ్లీలో బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు. యడ్యూరప్పకు మెజారిటీ ఎమ్మెల్యేల బలం లేకపోయినప్పటికీ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి.. గవర్నర్‌ ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఆరోపిస్తున్నాయి. అప్రజాస్వామికంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి నిరసనగా.. కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కర్ణాటక అసెంబ్లీ  ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు..

Image result for yeddyurappa

ఇప్పుడు యడ్యూరప్ప బలం నిరూపించుకోలగరా.. లేకుంటే జేడీఎస్-కాంగ్రెస్ లు తమ ఎమ్మెల్యేలను కాపాడుకుని యెడ్డీని సీఎం పీఠం నుంచి దించగలరా.. అనేదే ఆసక్తి కలిగిస్తున్న అంశం. బలనిరూపణ వరకూ ఎమ్మెల్యేలను కాంగ్రెస్, జేడీఎస్ లు కాపాడుకోగలిగితే యెడ్యూరప్ప సర్కార్ దిగిరాక తప్పదు. మరి ఆ పరిస్థితి వస్తుందా.. లేకుంటే బీజేపీ చక్రం తిప్పి సక్సెస్ సాధించగలుగుతుందా అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: