ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్‌ దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పుల జరుగుతున్నట్లు తెలిసింది. బలిమెల రిజర్వాయర్ పరిధిలోని సిమిలిపొదర్ అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి ఈ కాల్పుల పోరాటం కొనసాగుతున్నట్లు సమాచారం.  ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం ఉంది.
Image result for Odisha maoist rk
కాగా, మావోయిస్టు నాయకుడు ఆర్కేతో పాటు మరో ఇద్దరు ప్రముఖ నేతలు కూడా ఎదురుకాల్పుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒడిశా పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ గ్రే హౌండ్స్‌ బలగాలు ఉన్నాయి.  గత నెలలో మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవులు, చత్తీస్‌గఢ్‌లోని గోదావరి పరివాహాక ప్రాంతాల్లో పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మరణించారు. 
Image result for Odisha maoist rk
అయితే దండకారణ్యంలో మావోయిస్ట్ ల సమాచారం పోలీసులకు తెలియడంతో పెద్ద స్కెచ్ వేశారని, ఈ కాల్పుల్లో పోలీసులదే పైచేయి అవచ్చని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్న విషయాన్ని నిర్థారించారు. అంతే కాదు ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడినట్లు తెలుస్తోంది.  ఘటనాస్థలిలో మావోయిస్టుల కిట్‌ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.38 ఏళ్ల క్రితం ప్రారంభమైన గడ్చిరోలి తిరుగుబాటు ఉద్యమం చరిత్రంలో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: