జంటనగరాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు డ్నైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి.

మధ్యాహ్నం 3-3.30 గంటల ప్రాంతంలో కారుమబ్బులు కమ్మి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఫిలింనగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, మైత్రివనం, బోరబండ, కార్మికనగర్‌, రహమత్‌నగర్‌ ఇలా దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  అకాల వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ స్థంబాలు విరిగిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

ఎండల నుంచి ఉపశమనం ఏమోగాని.. అకాల వర్షాలతో రైతులకు మాత్రం పెను నష్టం వాటిల్లుతోంది. భారీ వర్షాలకు పంటనష్ట పోవడంతో తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఈ భారీ వర్షం కారణంగా కనుచూపుమేరలో ఏముందో కనిపించకపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎప్పుడు మాదిరిగానే రోడ్లన్నీ చెరువులను తలపించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: