రాష్ట్రంలో సీనియర్ నేతగా నేను ఉండగా నిన్న పార్టీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ఏంటని తన నిరసనను తెలియజేస్తూ ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు అలిగి అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎట్టకేలకు అజ్ఞాతం వీడి మీడియా ముందుకు వచ్చారు.


హైదరాబాదులోని తెలంగాణా బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన కర్ణాటక ఎన్నికలకు సంబందించి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబుపై విరుచుకపడ్డాడు. అప్పట్లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వాజపేయికి మద్దతు ఇవ్వలేదు. ప్రజలు ఎన్టీఆర్ ను చూసి ఓట్లు వేస్తే పార్టీని చీల్చిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి కర్ణాటక రాజకీయలపై మాట్లాడే నైతిక హక్కు  ఉందా? చెప్పుకొచ్చాడు.


సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో  పరిపాలనను పక్కనపెట్టి రాజకీయాల గురించి మాట్లాడటం చిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. మొన్న రాష్ట్రంలో జరిగిన బోటు ప్రమాదంపై స్పందించిన ఆయన, చంద్రబాబు బోటు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలపడం, వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వడం తప్ప ఇలాంటివి పునరావృతం అవకుండా  చర్యలు తీసుకోవడంలో బాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: