ఆ మద్య బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ నటించిన ‘ఓ మైగాడ్’ చిత్రాన్ని తెలుగు లో పవన్ కళ్యాన్, వెంకటేష్ కాంబినేషన్ లో ‘గోపాల గోపాల’ చిత్రం రిమేక్ చేశారు.  ఈ చిత్రం కాన్సెప్ట్ విషయానికి వస్తే..హీరో షాప్ భూ కంపంలో కూలిపోతుంది..దాంతో ఇన్స్ రెన్స్ క్లైమ్ చేసుకోవాలని చూస్తే..ప్రకృతి విపత్తు వస్తే దాని వల్ల నష్టం జరిగితే..ఇన్స్ రెన్స్ ఇవ్వరని చెప్పడంతో..దానికి కారణం అయిన దేవుడి పై కేసు వేస్తాడు. 
Image result for japan temple case
తాజాగా తనపై విపరీతమైన పనిభారాన్ని మోపుతున్నారంటూ జపాన్‌లోని  ఓ ఆలయంలో పనిచేస్తున్న బౌద్ధ సన్యాసి రూ.52 లక్షలకు (8.6 మిలియన్ యెన్‌లు) దావా వేశారు. దశాబ్ద కాలంగా ఆలయంలో పనిచేస్తున్న ఆయన పనిభారం కారణంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నానని కోర్టుకు తెలిపారు. పర్యాటకుల కోసం విరామం లేకుండా పనిచేస్తున్నానని, కాబట్టి తన ఆధ్యాత్మిక సేవలకు అందిస్తున్న వేతనంతోపాటు అధిక పనికి కూడా డబ్బులు ఇప్పించాలని కోర్టును వేడుకున్నారు. 
Image result for japan temple case
జపాన్‌లోనే అత్యంత పవిత్రమైన మౌంట్ కోయా అనే వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో సన్యాసి గత పదేళ్లుగా ఆధ్యాత్మిక విధులు నిర్వర్తిస్తున్నారు.  కాకపోతే ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో సెక్యూరిటీ కోసం కేసు వేసిన సన్యాసి పేరు, పనిచేస్తున్న ఆలయం వివరాలను చెప్పేందుకు అతడి తరపు లాయర్ నోరిటకే షిరాకురా నిరాకరించారు.  కాకపోతే తన క్లయింట్ తో స్థాయికి మించిన పని భారం ఎక్కువైందని..అందుకు సరైన పారితోషికం కూడా లేదని..అందుకే అతనికి విసుగి అనిపించి అందుకే ఈ పని చేశారని తెలిపారు.

2015లో కోయాసన్ ప్రాంతంలో 1200వ వార్షికోత్సవం నిర్వహించారని, ఈ సందర్భంగా పర్యాటకులు పోటెత్తడంతో తన క్లైంట్‌తో 64 రోజులపాటు ఏకధాటిగా పనిచేయించుకున్నారని ఆయన తెలిపారు. కొన్నిసార్లు అయితే రోజుకు 17 గంటలు పనిచేయించారని పేర్కొన్నారు. కాబట్టి అధికంగా పనిచేయించుకున్నందుకు గాను తన క్లైంట్‌కు రూ.52 లక్షలు ఇప్పించాల్సిందిగా కోర్టును కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: