కర్ణాటకలో రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. కాంగ్రెస్- జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంపులు నిర్వహిస్తుంటే, సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బెంగళూరులోని పలు కీలక స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేసిన యడ్డీ, నిఘా విభాగానికి కొత్త అధికారిని నియమించారు. నిన్నటి దాకా కర్ణాటక కేంద్రంగా సాగిన కన్నడ రాజకీయం.. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా మారింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా... కర్ణాటకలో అధికార పీఠం కోసం రాజకీయ పార్టీల మధ్య రసవత్తర పోరు కొనసాగుతున్నాయి.
Image result for yeddyurappa cm
బీజేపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వారం  గడువు ఇవ్వడంతో కాంగ్రెస్-జేడీఎస్‌ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్- జేడీఎస్‌ పార్టీలలో ఆందోళన నెలకొంది. ఉన్న ఈగల్టన్ రిసార్ట్స్‌ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించడంతో కేవలం ప్రయివేటు సెక్యూరిటీ మాత్రమే భద్రత నిర్వహిస్తోంది. ఎలాగైనా ఎమ్మెల్యేలను బయటకు రప్పించాలని యడ్యూరప్ప ప్రయత్నిస్తుంటే, వ్యూహాలను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది.

ప్రత్యేక విమానానికి అనుమతి లేకపోవడంతో కర్నూలు-హైదరాబాద్‌ రోడ్డు మార్గం ద్వారా రెండు ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో ఎమ్మెల్యేలు చేరుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ నేతృత్వం వహిస్తున్నారు. వీరికి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో బస ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు.
Image result for siddaramaiah kumaraswamy
మరోవైపు ఎమ్మెల్యేల తరలింపును జేడీఎస్‌ నేత థామస్‌ ధ్రువీకరించారు.  ఇదిలా ఉంటే  గత ఏడాది గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ వలసలు నివారించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఈ రిసార్టులోనే ఉంచింది.  ఇక యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై నేడు (శుక్రవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం పదిన్నర గంటలకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వాదనలు విననున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్‌ తరపున వాదనలు అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: