ప్రిన్స్ మహేష్ బాబు “భరత్ అనే నేను” సక్సస్ కొరటాల రాసిన ఆలోచింప డైలాగుల ప్రభావం ఎంతగానో ఉంది. ఈసినిమాలో పలు వర్తమాన రాజకీయ అంశాలు కొరటాల తనదైన రీతిలో ప్రేక్షకుల హృదయాలకు టచ్ చేస్తూ వైవిధ్యంగా చిత్రీకరించాడు. రాజకీయంగా పలు అంశాలను విస్తృతంగా చర్చించిన ఈమూవీలో ‘జవాబుదారీతనం’ అన్న పదాన్ని కొరటాల మహేష్ ‘భరత్’ పాత్ర చేత పదేపదే ఆమూవీలో చెప్పించాడు.
PAVAN BUSYAATRA MEDIA MEET PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే అనూహ్యంగా పవన్ గత రెండు రోజులుగా ప్రెస్ ముందు మాట్లాడుతున్న మాటలలో  ఈ ‘జవాబుదారీతనం’ అన్న పదాన్ని తెగ వాడుతున్నాడు. అదేవిధంగా ఈనెల 20వ తారీఖు నుండి పవన్ చేపట్టబోతున్న బస్సు యాత్రకు సంబంధించి విడుదల చేసిన ప్రెస్ నోట్ లో మహేష్ ‘భరత్’ సినిమాలో పలుసార్లు పలికిన ‘పొలిటికల్ అకౌంటబిలిటీ’ పదాన్ని వాడటం గమనించిన మీడియా వర్గాలు ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం. దీనితో పవన్ బస్సు యాత్రలో మహేష్ ‘భరత్’ డైలాగ్స్ ఉంటాయా అంటూ కొందరు మీడియా ప్రతినిధులు సెటైర్లు వేస్తున్నట్లు టాక్. 

పవన్ తిరుమలలో శ్రీవారి ఆశీస్సులు పొంది తిరుమల చుట్టుపక్కల పలు పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకున్న తరువాత ఈనెల 20వ తారీఖు నుండి ఇచ్చాపురం నుండి తన బస్సు యాత్ర ప్రారంభించబోతున్నాడు. ఈమధ్య కాలంలో పవన్ తన మాటలు వేడి తగ్గించిన నేపధ్యంలో ఈబస్సు యాత్ర ద్వారా చంద్రబాబు జగన్ లలో ఎవర్ని ఎక్కువ టార్గెట్ చేస్తాడు అన్న ఆసక్తి బాగా పెరిగింది. 
PAVAN BUSYAATRA MEDIA MEET PHOTOS కోసం చిత్ర ఫలితం
జనసేన వర్గాలు ప్రచారం చేస్తున్న వార్తల ప్రకారం ఇది పవన్ బస్సు యాత్ర కాదని పోరాట యాత్ర అని అంటున్నారు.  ఉత్తరాంధ్ర జిల్లాల్లో 45 రోజుల పాటు ఈయాత్ర జరుగబోతున్న నేపధ్యంలో పవన్ ఏమైనా సంచలన విషయాల గురించి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమస్యల గురించి తన ఆలోచనలలోని పరిష్కార మార్గాలు చెపుతాడా లేకుంటే ఇప్పటికే ఎందరో మాట్లాడి అరిగిపోయిన గ్రామ్ ఫోను రికార్డులా మారిపోయిన ప్రత్యేక హోదా విషయాన్ని హైలెట్ చేస్తూ తన పోరాట యాత్ర కొనసాగిస్తాడా అన్నది రానున్న మరో రెండు రోజులలో తేలిపోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: