కర్ణాటక రాజకీయ పరిణామాలు చంద్రబాబును బాగా టెన్షన్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఎటు తిరిగీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకూడదు అనేది చంద్రబాబు కోరిక. తను బీజేపీని ఇప్పుడు కాదంటున్నాను కాబట్టి అక్కడ బీజేపీ గెలవకూడదు అనేది చంద్రబాబు కోరిక.



తీరా ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలత కనిపించే సరికి బాబు డంగైపోయాడు. బీజేపీ అనుకూలత నేపథ్యంలో.. తను కర్ణాటకలో కమలాన్ని ఓడించాలని పిలుపు నివ్వలేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మాట మార్చాడు మన యూటర్న్ అంకుల్. 


కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అనైతికంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అయితే చంద్రబాబు ఇప్పుడు విలువల గురించి మాట్లాడటం విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు విలువల గురించి మాట్లాడటం విడ్డూరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


కర్ణాటకలో బిజెపి ఓటమికి టిడిపి అధినేత ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా శ్రమించినా ఏవరూ ఊహించనన్ని శాసన సభ స్థానాలు బిజెపి గెలుచుకుంది. దీంతో ఒక్కసారి మానసికంగా కుంగిపోయారు చంద్రబాబు. అయితే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి తొమ్మిది శాసనసభ్యులు తక్కువయ్యరు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విషయం సమస్యల్లో చిక్కుకుంది. దరిమిలా చంద్రబాబు పూర్తిగా తేరుకొన్నారు. ఇక తనదైన శైలిలో ఇక తన ఉత్సాహాన్ని మాటల్లో ఇలా వెల్లడించారు

chandrababu campaign to defeat BJP in karnataka కోసం చిత్ర ఫలితం

కర్ణాటకలో బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు.  ప్రకాశం జిల్లా కందుకూరులోని మార్కెట్‌ యార్డులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీ లు కలిసి పూర్తి మెజార్టీ కలిగి ఉన్నాయని వారికి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందన్నారు.

chandrababu campaign to defeat BJP in karnataka కోసం చిత్ర ఫలితం 

కాగా, అప్రజాస్వామ్యకంగా, రాజ్యాంగ విలువలను అతిక్రమించి  బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నించిందని దుయ్య బట్టారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఉన్న హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కిన బీజేపీ కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకూడ దని తాము కర్నాటకలోని తెలుగు వారిని కోరినట్లు గుర్తుచేశారు.

 chandrababu campaign to defeat BJP in karnataka కోసం చిత్ర ఫలితం

తమ పిలుపుకు కొంత మేరవారి నుంచి స్పందన వచ్చిందని, వారంతా బీజేపీకి ఓట్లు వేయలేదని  ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ కు న్యాయబద్ధం గా, చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల్ని కల్పించకుండా బీజేపీ తన స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తోందని బాబు అన్నారు. కొన్ని పార్టీలు కులాలు, మతా ల మధ్య చిచ్చుపెట్టి వ్యక్తుల్ని రెచ్చగొట్టి అరాచకాలకు ప్రేరేపిస్తున్నాయన్నారు.

chandrababu campaign to defeat BJP in karnataka కోసం చిత్ర ఫలితం 

రాష్ట్రానికి హోదా సాధించడానికి ప్రజలంతా కేంద్రంపై పోరాడటానికి రావాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా విపక్ష నేత జగన్‌ పైనా చంద్రబాబు పరోక్షంగా నిప్పులు చెరిగారు. కేంద్రానికి సహకరించే వారిని రాష్ట్ర ద్రోహులుగా గుర్తించాలని  జగన్‌కు చురకలు అంటించారు.

chandrababu campaign to defeat BJP in karnataka కోసం చిత్ర ఫలితం 

ప్రస్తుతం రాష్ట్ర హక్కుల కోసం, న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పోరాడాల్సిన వ్యక్తులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నారన్నారు. తమపై ఉన్న కేసుల్ని మాఫీ చేయించుకోవడం కోసం బీజేపీతో చేతులు కలిపి నీతివంతమైన పాలన చేస్తున్న తనపై విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాల కైనా వెనుకాడబోనని చంద్రబాబు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25ఎంపీ సీట్లును కైవసంచేసుకుని కేంద్రప్రభుత్వ ఏర్పాటు  లో మనమే కీలకం కావాలని చంద్రబాబు అన్నారు.


ఆ సంగతలా ఉంటే ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్-జెడిఎస్ కాంపు  రాజకీయాల విషయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్, జేడీఎస్‌ లకు మార్గదర్శకత్వం ఇస్తున్నాడట. ఇది వరకూ ఇలాంటి క్యాంపులు నడిపిన అనుభవం చంద్రబాబుకి  ఉంది. క్యాంపుల్లోని ఎమ్మెల్యేలను ఎలా ఆకట్టుకోవాలి? వారిని ఎలా ప్రలోభ పెట్టాలి? ఫిరాయింపులు ఎలా చేయించాలి? అనే అంశం పై కూడా బాబుకు చాలా చరిత్ర ఉంది.


ఇప్పుడు బాబు తనకున్న నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం కలబోసి అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు దారబోస్తున్నాడు అనే  సమాచారం. ఇక చంద్రబాబు గతంలో ఇలాంటి పరిణామాల్లో బీజేపీకి మద్దతు పలికాడు. గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచి నప్పుడు కూడా చంద్రబాబు మారు మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం బాబు లెక్కలు మారిపోయాయి. అదుపుతప్పి  మాట్లాడేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాగే బాబు దారిలోనే మొత్తం పచ్చమీడియా బిజెపి వ్యతిరేఖత కుమ్మరిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: