మొత్తానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ తన మనసులోని మాట బయట పెట్టారు.  మొన్నటి వరకు తనకు పదవి ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యమని అన్న ఆయన.. ప్రజలు అవకాశం ఇస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం ప్రభుత్వాలకు సరికాదన్నారు. తెలుగుదేశం, బీజేపీలు హామీలను నెరవేర్చకపోవడం వల్లే నేను ప్రజలలోకి వచ్చానని చెప్పారు. బాధ్యతల నుంచి పారిపోయే వ్యక్తిని కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అవకాశం ఇస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తానని అన్నారు.
అవకాశమిస్తే బాధ్యతాయుతమైన ప్రభుత్వం
శుక్రవారంనాడు ఆయన గంగవరం ఎయిర్‌పోర్టు నిర్వాసితులతో మాట్లాడారు. నేతల స్వార్థం కోసం, వారి కుటుంబాల కోసం ప్రభుత్వాలు పనిచేయరాదని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోరాదని అన్నారు.  పవన్‌ మాట్లాడుతుండగా అక్కడున్న పవన్‌ అభిమానులు, స్థానికులు సిఎం.. సిఎం అంటూ నినాదాలు చేయడంపై స్పందించిన ఆయన మీరు సిఎం అని నినాదాలు చేయడం ద్వారా గంగవరం పోర్టు కాలుష్యం తగ్గదంటూ తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నేతలు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రం హామీలు నెరవేర్చలేదు
మాటతప్పిన ఎమ్మెల్యేలను గ్రామాల్లోనికి రానీవకుండా సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.  నేతల స్వార్థం కోసం, వారి కుటుంబాల కోసం ప్రభుత్వాలు పని చేయరాదని, ప్రజల సంక్షేమం కోసం పని చేయాలన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోరాదన్నారు. టీడీపీ, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయన్నారు. అందుకే తాను ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. తాను బాధ్యతల నుంచి పారిపోయే వ్యక్తిని కాదన్నారు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని, పార్లమెంటులో మాటలు ఇస్తారని, వాస్తవ రూపంలో మాత్రం వాటిని నెరవేర్చరని, దీనిని నిలువరించాలని పవన్ కళ్యాణ్ అంతకుముందు రోజు అన్నారు.
పోరాట యాత్రతో ప్రజల్లోకి
రాజకీయ జవాబుదారీతనాన్ని తిరిగి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.  రాజకీయ జవాబుదారీతనం లక్ష్యంగా 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 20 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని తీరప్రాంతంలో గంగపూజ చేసి, జై ఆంధ్రలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించి 45 రోజుల జనసేన పోరాటయాత్ర ప్రారంభిస్తామన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: